Unstoppable: Rajamouli and Keeravani with Balakrishna: నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా మూవీల్లో నటిస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోతో అలరిస్తున్నారు. అన్‌స్టాపబుల్‌ షో (Unstoppable).. నాన్ స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. గత ఎపిసోడ్‌లో బాలకృష్ణ అఖండ టీమ్‌తో ఫుల్ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు షోలలో మోహన్‌బాబు, (Mohanbabu) నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా వచ్చారు. హోస్ట్‌గా బాలయ్య (Balayya) అడిగే ప్రశ్నలకు.. గెస్ట్‌లు ఇచ్చే ఆనర్స్‌తో షో అన్‌స్టాపబుల్‌గా (Unstoppable) రన్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్‌స్టాపబుల్‌ తర్వాతి ఎపిసోడ్‌లో దర్శకదిగ్గజం రాజమౌళితో (Rajamouli) పాటు మ్యూజిక్‌ డైరెక్టర్ కీరవాణి (Keeravani) సందడి చేయనున్నారు. దీంతో బాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి కాంబోలో రానున్న ఎపిసోడ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. రాబోయే ఎపిసోడ్‌ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.



 


ఇక అన్‌స్టాపబుల్‌ రాబోయే ఎపిసోడ్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్‌తో పాటు ఆర్‌‌ఆర్‌‌ఆర్ ప్రమోషన్స్ కూడా జరగనున్నాయి. తారక్, చరణ్‌ కాంబోలో వస్తోన్న ఆర్‌‌ఆర్‌‌ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కానుంది. దీంతో పనిలో పనిగా ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఆహాలో (Aha) స్రీమింగ్‌ అయ్యే అన్‌స్టాపబుల్‌ వేదికగా జరగనున్నాయి.


Also Read : Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- ఐదుగురు ప్రయాణికులు మృతి


ఇక ఇటీవల జరిగిన అఖండ ప్రీ రిలీజ్‌ వేడుకలో బాలకృష్ణపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ఒక ఆటమ్‌బాంబులాంటి వారంటూ పొగిడారు. మొత్తానికి నెక్స్ట్‌ ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండనుంది. త్వరలోనే ఈ లేటెస్‌ ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్ కానుంది. ఇక అఖండ విజయంతో.. సక్సెస్‌ ఎంజాయ్ చేస్తోన్న బాలకృష్ణ (Balakrishna) ఈ ఎపిసోడ్‌లో మరింత ఎనర్జీతో కనిపించనున్నట్లు ఉన్నారు.


Also Read : అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook