Unstoppable Show: నట సింహం బాలకృష్ణ సినిమాలతో పాటు టాక్​ షోతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే అఖండతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బాలయ్య.. తదుపరి ప్రాజెక్ట్​లపై దృష్టిసారించారు. ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే.. అహా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో 'అన్​ స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోలో (UnstoppablewithNBK) వ్యాఖ్యాతగా (Unstoppable Show) వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ నటుడు బాలకృష్ణ.. టాలీవుడ్​ స్టార్స్​తో ఈ షోలో చేసే సందడి అన్ని వర్గాల ప్రేక్షకులకను ఆకట్టుకునేలా ఉంటుంది. దీనితో విజయవంతంగా ఈ షో ఐదు ఎపిసోడ్​లు పూర్తి చేసుకుంది.


ఆరవ ఎపిసోడ్​కు గెస్ట్​గా మాస్​ మహారాజ్​ రవితేజ (Ravi Teja in Unstoppable Show) విచ్చేయనున్నారు. వీరిద్దరితో పాటు డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా ఈ షోలో సందడి చేయనున్నారు. బాలకృష్ణ, రవితేజల కాంబినేషన్​ స్టేజ్​పై అదిరిపోతుందని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రేజీ కాంబినేషన్​తో (Ravi teja with NBK) ఆరవ ఎపిసోడ్​ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 24న స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుంది. 



ఇంతకు ముందు ఐదు ఎపిసోడ్​లు ఇలా..


ఈ షోకు మొట్ట మొదటి గెస్ట్​గా నటుడు మోహన్​ బాబు విచ్సేసి సందడి చేశారు. రెండో ఎపిసోడ్​లో హీరో నాని గెస్ట్​గా వచ్చారు.
ఇక మూడో ఎపిసోడ్​లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్​ రావిపూడి గెస్టులుగా విచ్చేసి సందడి చేశారు. నాలుగో ఎపిసోడ్​లో అఖండ టీమ్​ను (Akhanda Movie) ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ. ఐదోవ ఎపిసోడ్​లో దర్శక ధీరుడు రాజమౌలి, మ్యూజిక్ డైరెక్టర్​ ఎం.ఎం కీరవాణి హాజరయ్యారు. అన్ని ఎపిసోడ్​లు భారీ మంచి విజయం సాధించాయి.


ఇప్పటికే సూపర్​స్టార్ మహేశ్​ బాబు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్​ ఎప్పుడు స్ట్రీమ్​ చేస్తారనే విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.


Also read: Sara Ali khan Movie : షూటింగ్ స్పాట్‌లో అతి సామాన్యంగా..సైఫ్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్


Also read: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో అదుర్స్...స్టేజ్ పై టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సందడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook