Unstoppable with NBK Season 4: నందమూరి నట సింహం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ నిజంగా పేరు తగ్గట్టు అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నాయి. మూడో సీజన్ ఒకటి రెండు ఎపిసోడ్స్ తో సరిపెట్టారు. కానీ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కు రానున్న నాల్గో సీజన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా బాలయ్యకు చంద్రబాబు స్వయనా బావ కమ్ వియ్యంకుడు అవుతాడు. అంతేకాదు తెలుగు దేశం పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చంద్రబాబు సీఎం పగ్గాలు చేపడితే.. బాలయ్య మాత్రం కేవలం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లెజండరీ  బావ బామ్మర్దులు పాల్గొంటున్న ఈ షోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. ముఖ్యంగా చంద్రబాబుతో బాలయ్య.. తన చెల్లెలుతో చూసిన బెస్ట్ రొమాంటిక్ మూవీ ఏంటి ప్రశ్న అడగటంతో పాటు గత ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయించిన వ్యవహారం..జైల్లో 53 రోజులు ఎలా గడిచాయి. ఏపీలో జనసేనతో పొత్తు వంటి వ్యవహారాలు చర్చకు రానున్నాయి. మరోవైపు భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ పగ్గాలు.. ఎన్టీఆర్, లోకేష్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నాయనే ప్రశ్నలు ప్రేక్షకులను ఆసక్తి రేకిస్తున్నాయి. మరోవైపు ఆకాశంలో సూర్య, చంద్రులు.. ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ బాబు అంటున్నారనే ప్రశ్న కూడా ఆసక్తి రేకిస్తున్నాయి. ఇంట్లో భువనేశ్వరి డామినేషనా.. బ్రాహ్మణి డామినేషన్ నడుస్తుందా అనే ప్రశ్నలు ఆసక్తి రేకిస్తున్నాయి.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


అయితే.. తాజాగా ఈ షో చూడటానికి కొంత మంది ఐటీ ఎంప్లాయిస్ సెలవు కావాలంటూ రోడ్డుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఐతే.. దాదాపు అన్ని ఐటీ కంపెనీలు శుక్రవారం సాయంత్రానికి అయిపోతాయి. పైగా రేపు, ఎల్లుండి వీకెండ్.  పైగా ఇది సినిమా కాదు.. ఇంటర్వ్యూ.. ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేది రాత్రి 8.30 గంటలకు .. టీవీలో అయితే.. అదే టైముకు చూడాలి. దానికి సెలవు కావాలని అడగటంలో ఓ మీనింగ్ ఉంది.  కానీ ఓటీటీలో మనకు వీలున్నపుడు చూసుకోవచ్చు. దానికి సెలవు కావాలంటూ అతి చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు చాలా మంది నెటిజన్స్. ఐతే.. పచ్చ మీడియాకు చెందిన కొంత మంది కావాలనే వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యంతో ఇదంత చేసారనే కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి వినపబడుతున్నాయి. ఓటీటీలో మనకు నచ్చినపుడు మనకు వీలు కుదిరిన టైమ్ లో చూసుకోవచ్చు. అంతోటి దానికి ఇంత హంగామా చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్ల వల్ల తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు, బాలయ్యలకు చెడ్డ పేరు తీసుకురావడమే తప్ప.. మరొకటి ఉండదనే కామెంట్స్ నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా ఈ విషయమై రోడ్డు ఎక్కిన వారు ఆలోచిస్తే బాగుంటుంది.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter