Unstoppable with NBK: టీడీపీ భవిష్యత్తు ఎన్టీఆర్ చేతుల్లోకా? లోకేష్ చేతుల్లోకా..బాబు ఏమన్నారంటే..?
CBN about Jr NTR: బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే సీజన్ 4 ప్రసారం కానుంది. ఈ సీజన్ మ4 లో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా.. చంద్రబాబు నాయుడు రావటంతో.. అలానే ఈరోజు విడుదలైన ప్రోమోలో.. చంద్రబాబు నాయుడు పై బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు కురిపించడంతో.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి.
Jr NTR: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా ఇప్పుడు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇక తాజాగా అక్టోబర్ 25వ తేదీ.. నుంచి ఈ షో నాలుగవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకి రాబోతున్న ముఖ్య అతిథికి సంబంధించిన ప్రోమోని కూడా మేకర్స్ విడుదల చేశారు.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ఫస్ట్ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రోమోని విడుదల చేయగా.. ఈ ప్రోమోలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్తులో టిడిపి పార్టీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందా..? లేక లోకేష్ చేతుల్లోకి తీసుకుంటారా..? అనే విషయంపై కూడా బాలకృష్ణ ప్రశ్నించినట్లు సమాచారం.
నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ , ఎన్టీఆర్ మధ్య మాటలు లేవన్న విషయం తెలిసిందే. దీనికి తోడు నారా చంద్రబాబు నాయుడు కూడా..ఎన్టీఆర్ను దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్లో..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో.. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.మరొకవైపు బాలకృష్ణ 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ.. వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో ఇంకా వీరి మధ్య గొడవలు సద్దుమనగ లేదంటూ.. అందరూ కామెంట్లు చేశారు.
అలాంటి బాలకృష్ణ తొలిసారి ఎన్టీఆర్ పేరు.. ప్రస్తావించడం అందులోనూ టిడిపిని ఆయనకు అప్పగిస్తారా అని చంద్రబాబు నాయుడుని అడగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ పేరు.. ప్రస్తావించారని తెలియడంతో అభిమానులు సైతం కోలాహాలంతో సందడి చేస్తున్నారు. మళ్ళీ తమ అభిమాన హీరోని నందమూరి ఫ్యామిలీలోకి కలుపుకోవాలని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.
ఇకపోతే బాలయ్య , చంద్రబాబు మధ్య సంభాషణ ఒక రేంజ్ లో జరిగిందని ప్రోమో చూస్తూ మనకు అర్థమవుతుంది. మరొకవైపు బాలకృష్ణ, చంద్రబాబు మధ్య చిలిపి విషయాలు కూడా జరిగినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter