Unstoppalbe Season 4 NBK With Suriya:  అన్ స్టాపబుల్ టాక్ షో .. నిజంగానే అన్ స్టాపబుల్ గా సాగిపోతూనే ఉంది. ఈ షోలో ప్రముఖ సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేసే పద్ధతి చూసి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ ఫస్ట్ ఎపిపోడ్ ను చంద్రబాబుతో మళ్లీ చేసారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులను అడిగి మరి ప్రేక్షకులకు తెలుసుకునేలా చేసారు. రెండో ఎపిసోడ్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ఇంటర్వ్యూ చేయడం.. మధ్యలో ముమ్ముట్టితో మాట్లాడం అంతా సరదగా సాగిపోయింది.   తాజాగా ఈ వారం ఎపిసోడ్ లో తమిళ స్టార్ హీరో సూర్య.. బాలయ్య టాక్ షోకు విచ్చేసారు. ఈ సందర్బంగా బాలకృష్ణ.. సూర్య ఇంట్రడక్షన్ ను ఓ రేంజ్ చెప్పడం అభిమానులను అలరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేను సింహం అయితే అతను సింగం.. నేను లెజెండ్ అయితే అతను గజిని.. నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ సూర్యకు స్వాగతం పలికారు. మరోవైపు ఈ షోలో బాలయ్య.. సూర్యతో కలిసి గజినీ సినిమాలో ‘హృదయం ఎక్కడున్నాది’ పాటకు డాన్స్ చేయడం హైలెట్ గా నిలిచింది.    



ఈ సందర్భంగా సూర్యతో తమ్ముడు కార్తితో అనుబంధం గురించి పలు ప్రశ్నలు అడిగారు. అంతేకాదు సూర్య తన సీక్రెట్స్ ఎవరితో పంచుకుంటారు. భార్య జ్యోతికతోనా.. లేకపోతే తమ్ముడు కార్తితోనా అంటూ బంపర్ ఫిట్టింగ్ పెట్టారు బాలయ్య. అంతేకాదు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నందుకు అభినందించారు.


ఈ షోలో సూర్య.. బాలయ్య కాళ్లు మొక్కారు. మధ్యలో కార్తి తో ఫోన్ లో చేసిన చిట్ చాట్ తో ఈ ఎపిపోడ్ ఎపుడు చూడాలనే ఆసక్తి పెంచారు. మొత్తంగా సూర్య అన్ స్టాపబుల్ షో కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ షోలో డైరెక్టర్ శివతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ కూడా సందడి చేసారు. మొత్తంగా ఈ షో ఫుల్ ఎపిపోడ్ ఈ నెల 8న ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. అక్కడ ఈ షోలో ఎలాంటి సంచలనాల నమోదు చేస్తుందో చూడాలి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.