Apollo Prathap Reddy Car Accident: అపోలో హాస్పటల్ చైర్మన్ ఉపాసన కామినేని తాత ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు చెన్నైలో స్పల్ప ప్రమాదానికి గురైయింది. చెన్నైలో ఓ వ్యాన్ అనుకోకుండా ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో అపోల్ ప్రతాప్ రెడ్డి వెంటుక వ్రాసీలో బటయపడ్డారు. అపోలో ప్రతాప్ రెడ్డి ఉపాసన కు తాత అవుతారు. ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ భార్యగా.. మెగా కోడలిగా ఉంటూనే.. అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. గతేడాది ఉపాసన, రామ్ చరన్ దంపతులుకు క్లీంకారా పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో వరుసగా ఒకదాని వెంబడి మరొకటి ఆనందాలు వెల్లివిరిస్తున్నాయి. చిరుకు పద్మ విభూషణ్, రామ్ చరణ్ కు డాక్టరేట్.. జనసేన అనూహ్య విజయాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపాసన  కొణిదెల .. అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. భర్త  రామ్ చరణ్, మావయ్య చిరంజీవిలు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వనంత వరకు వారికీ  సంబంధించిన సినీ విశేషాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉండేవారు. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ సోషల్ మీడియలో ఎంట్రీ ఇచ్చాకా.. తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా క్లీంకారా వీరి జీవితంలో వచ్చాకా.. పాపే లోకంగా బతుకుతోంది. పాపకు సంబంధించిన ఆలనా పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. అంతేకాదు అపోలో హాస్పిటల్ కు సంబంధించిన హెల్త్ మ్యాగజైన్ కోసం కొన్ని ఇంటర్వ్యూలను చేస్తోంది. ప్రస్తుతం క్లీంకారాతో బిజీగా ఉండటంతో ఈ వ్యవహారాలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంచర్‘ మూవీ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా  అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా చేస్తూనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిగా నటిస్తోంది.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook