COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Upasana Konidela offer to wildlife workers : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ రంగానికి ఏ మాత్రం దగ్గరగా లేని ఆమె రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రామ్ చరణ్ భార్యగా నే ఆయనకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా మరోపక్క తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన బాధ్యతలను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి సేవ చేస్తూ ఉండే ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.


ఉపాసన కొణిదెల ప్రస్తుతం తన తాత ప్రతాపరెడ్డికి చెందిన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క భర్తకు మంచి భార్యగా ఉంటూ ఆయన బాధ్యతలు చూసుకుంటూనే మరో పక్క హాస్పిటల్ బాధ్యతలు కూడా ఆమె చేపట్టారు. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతూ ఉండే ఆమె తాజాగా తమ అపోలో హాస్పిటల్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సాధారణంగానే అడవులు అన్నా,  వన్యప్రాణుల అన్నా ఎంతో ఇష్టం చూపించే ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. 


వన్యప్రాణి సంరక్షణ కోసం,  జంతు,  జీవ రాశుల పోషణ,  సంరక్షణ కోసం పని చేసే వారికి తమ అపోలో హాస్పిటల్స్ చైన్ ద్వారా ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని ఉపాసన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందు కోసం అపోలో ఫౌండేషన్,  డబ్లూడబ్లూఎఫ్‌తో కలిసి పని చేయనుందట. ఈ మేరకు ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా అడవిలో గాయాలపాలైన ఫారెస్ట్ రేంజర్ లు,  ఇతర ఫారెస్ట్ సిబ్బందికి ఎలాంటి వైద్య సేవలు అందించడానికి అయినా తాము ముందుంటామని ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక ఉపాసన చేసిన పోస్ట్ మీద మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పలువురికి ఆమె చేస్తున్న సేవ మరువలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Keerthy Suresh's Dog in Special Flight: కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్.. మాములుగా లేదుగా!


Also Read: Ram Pothineni Marriage : రామ్ పోతినేని ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.