Upasana Konidela About Her Urlife: గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. కొత్త ఆరంభం అంటూ ఉపాసన పోస్ట్
Upasana Konidela Shares a Post: ఉపాసన కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. తన కొత్త ఆఫీస్‌ను ప్రారంభించామని, అదే సమయంలో రామ్ చరణ్ కొత్త చిత్రం కూడా అనౌన్స్ అయిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
Upasana Konidela Post a New Post: మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఉపాసన నెట్టింట్లో చేసే కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన కోసం చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కరోనా ఇంకా మన దేశంలోకి రాక ముందే.. ఉపాసన అందరినీ హెచ్చరించింది. కానీ అప్పుడు దాన్ని ఎవ్వరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కరోనా వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని కూడా శాస్త్రీయ పద్దతిలో చెప్పింది.
అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఉపాసన. ఇక ఆమె చెప్పే చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహార తయారీ విధానం, పోషకాహారానికి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. ఆ మధ్య యువర్ లైఫ్ అనే మ్యాగజైన్, వెబ్ సైట్‌ను ఉపాసన ప్రారంభించింది. దాంట్లో సమంతను కూడా భాగస్వామిగా చేసుకుంది.
[[{"fid":"254222","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
హెల్తీ ఫుడ్ గురించి సమంతతో కలిసి ఓ వీడియోను కూడా చేసింది ఉపాసన. సమంత చేసిన స్పెషల్ ఇడ్లీల గురించి ఉపాసన ఓ పోస్ట్ కూడా వేసింది. అలా ఆ యువర్ లైఫ్ కోసం ఇప్పుడు ఓ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారట. కొత్త ఆరంభం అంటూ ఉపాసన యువర్ లైఫ్ ఆఫీస్ గురించి పోస్ట్ వేసింది. అంతే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ.. న్యూ బిగినింగ్ అని పోస్ట్ చేసింది.
ఇక రామ్ చరణ్ కియారా అద్వాణీలు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. RC 15 సాంగ్ షూటింగ్ కోసం శంకర్ అండ్ టీం అక్కడకు వెళ్లింది. దాదాపు ఓ పది రోజులు అక్కడే షూటింగ్ జరగబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ తరువాత మళ్లీ శంకర్ తన ఇండియన్ 2 పనులతో బిజీగా ఉంటాడు. రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టే చాన్స్ కూడా ఉంది. అయితే ఇలా ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లలేకపోవడంపై ఉపాసన చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. మిస్ యూ అంటూ కియారా పోస్ట్‌కు ఉపాసన రిప్లై ఇచ్చింది.
Also Read : Ananya Panday latest Pics : అదరహో అనిపిస్తోన్న అనన్య.. పిచ్చెక్కిస్తోన్న లైగర్ పోరి
Also Read : Bigg Boss Nominations : ఆ ఇద్దరికి ఢోకా లేదు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook