Bigg Boss Nominations : ఆ ఇద్దరికి ఢోకా లేదు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 6 Telugu 13th Week Nominations బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్‌లోనే ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 06:29 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో 13వ వారం నామినేషన్స్
  • డేంజర్ జోన్‌లో ఆ నలుగురు?
  • సేఫ్ కాబోతోన్న ఆదిరెడ్డి,రేవంత్
Bigg Boss Nominations : ఆ ఇద్దరికి ఢోకా లేదు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 6 Telugu 13th Week Nominations : బిగ్ బాస్ ఇంట్లో సోమవారం ఎపిసోడ్ వచ్చిందంటే చాలు నామినేషన్లో హీట్ ఎక్కిపోవాల్సిందే. అయితే ఇప్పటికే రెండు ప్రోమోలు వదిలింది బిగ్ బాస్ టీం. ఫ్యామిలీ ఎపిసోడ్స్ తరువాత.. తమ తమ స్థానాలు ఏంటి?.. జనాల ఆదరణ ఎలా ఉందనేది ఒక అంచనా వచ్చేస్తోంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంతో ఆటను ముందుకు తీసుకెళ్తుంటారు. కొందరు అతి నమ్మకంతో ఆడుతారు. ఇంకొందరు జాగ్రత్తగా తమ తప్పులను సరి చేసుకుంటూ ఆడతారు.

ఫైమాకు తన తల్లి ఎంతో ముద్దుగా చెప్పింది. వెటకారం నచ్చడం లేదు.. జనాలకు నువ్ అలా చేస్తుంటే నచ్చడం లేదు అంటూ చెప్పేసింది. ఇక ఫైమా ఆ వెటకారాన్ని కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. నామినేషన్లో ఒళ్లు దగ్గర పెట్టుకుంటోంది. సత్య సైతం తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు పెట్టుకున్నట్టుగా ఉంది. మొదట్లో ఉన్న సత్య కావాలంటూ హింట్ ఇచ్చాడు ఆయన. అలా తల్లిదండ్రులు ఇచ్చిన సూచలను వీరి పాటిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

ఈ వారం నామినేషన్ ప్రోమోలు చూస్తుంటే మాత్రం ఫైమా, సత్యలు కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. పాయింట్లు మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ.. వాటికి వెటకారాలు జోడించి, ఒళ్లంతా అటూ ఇటూ తిప్పుతుంటూనే జనాలకు విసుగొస్తుంది. ఈ సారి నామినేషన్స్‌లో రేవంత్ వర్సెస్ ఫైమా అనేట్టుగా ఉంది. రేవంత్ కోపం అందరికీ తెలిసిందే. అయితే ఇది మరింత బార్డర్ దాటుతుందా? లేదా చివరకు ఫైమానే తన వెటకారంతో చెడగొట్టుకుంటుందా? అన్నది చూడాలి.

ఇక ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, సత్య, కీర్తిలు నామినేషన్లోకి వచ్చారు. ఇనయ, శ్రీహాన్‌లు సేఫ్ అయ్యారు. అయితే నామినేషన్లో ఉన్న ఆదిరెడ్డి, రేవంత్‌లు ఎలాగూ ఎలిమినేట్ అవ్వరు. ఫైమా, సత్యలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక రోహిత్, కీర్తిలోంచి ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. మరి వీరు తమ ఆటలతో తమ తమ గ్రాఫ్‌ను పెంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Hyper Aadi Bald Head : హైపర్ ఆదికి ఘోర అవమానం?.. గుండు కొట్టించి పంపించారుగా!

Also Read : Baba Movie to Re-Release : BaBa సినిమా కోసం రజినీ డబ్బింగ్.. మళ్లీ కొత్తగా, స్టైలీష్‌గా రీ రిలీజ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x