Uppena movie actress Krithi Shetty's remuneration for Ram’s film: ఉప్పెన సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఉప్పెన లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న కొత్త హీరోయిన్ కృతి శెట్టికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. Uppena movie release కాకముందే నాని హీరోగా రూపొందుతున్న Shyam Singha Roy, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే తాజాగా రామ్ సరసన సైతం జంటగా నటించే ఆఫర్ సొంతం చేసుకుందీ కుర్ర హీరోయిన్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Red movie తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో సినిమాకు సైన్ చేసిన రామ్.. ప్రస్తుతం ఆ సినిమాను పనిలోనే బిజీగా ఉన్నాడు. Director Linguswamy మూవీలో కొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడని.. అందుకోసమే రామ్ కొత్త గెటప్ కోసం మళ్లీ భారీగా గడ్డం పెంచుతున్నాడని టాక్. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ చేయనున్న ఈ సినిమాకు మేకర్స్ కృతిశెట్టిని హీరోయిన్‌గా ఫైనల్ చేసుకున్నారు. 


Also read : Shruti Haasan remuneration: సలార్ మూవీ కోసం రేటు పెంచిన శృతి హాసన్


Uppena movie తో కృతి శెట్టికి వచ్చిన క్రేజ్ చూసిన రామ్ సినిమా నిర్మాతలు.. అందుకోసం ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చారట. ఇంతకీ రామ్ సినిమా కోసం Krithi Shetty remuneration ఎంత చార్జ్ చేసిందో తెలుసా ? అక్షరాల రూ. 50 లక్షలు. ఒక చిన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై.. ఒక్క సినిమా విడుదలతోనే అంత పారితోషికం అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో Actress Krithi Shetty కూడా ఒకరు అంటున్నాయి సినీవర్గాలు. కృతి శెట్టి త్వరలోనే సైన్ చేసే తదుపరి సినిమాలకు కోటి వరకు పారితోషికం అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనేది ఫిలింనగర్ టాక్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook