Uppena movie director gets Benz car gift: ఉప్పెన మూవీ ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్‌కి మంచి లాభాలు (Good returns) తెచ్చిపెట్టింది. భారీగా లాభాలు వచ్చిన ప్రతీసారి తమ చిత్ర దర్శకులకు ఖరీదైన బహుమతి ఇచ్చిన వారిని ఆనందపరిచే మైత్రి మూవీ మేకర్స్ ఈసారి తమకు లాభాలు తెచ్చిపెట్టిన బుచ్చిబాబుకు కూడా ఓ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఆ బమహుతి మరేంటో కాదు.. SUV Mercedes Benz car. అవును మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Benz GLC 200D Matic model car ని నిర్మాతలు బుచ్చిబాబుకు బహుమతిగా అందించారు. ఈ కారు ఖరీదు 1 కోటి రూపాయలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Uppena movie సక్సెస్ అయిన తర్వాత బుచ్చిబాబుకు అదనంగా పారితోషికం చెల్లించిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా కోటి రూపాయల ఖరీదైన Benz car ను కూడా గిఫ్టుగా ఇచ్చారంటే ఆ సినిమా సక్సెస్ పట్ల వాళ్లు ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. బుచ్చిబాబుకు తమ బ్యానర్‌లోనే మరో సినిమా కూడా ఆఫర్ చేశారు. 


Also read : RRR Poster: రామ్ చరణ్‌కి Birthday gift ఇచ్చిన రాజమౌళి


Director Buchi Babu పట్ల నిర్మాతలు ఈ విధంగా తమ అభిమానాన్ని చాటుకోగా.. దర్శకుడు బుచ్చి బాబు ఏం చేశాడో తెలుసా ? తన కెరీర్‌కి బాటలు వేసిన తన గురువు, ఫేమస్ డైరెక్టర్ సుకుమార్‌ని తన కారులో ఫస్ట్ రైడ్‌కి తీసుకెళ్లాడు. ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ మది దోచుకున్న క్రితి శెట్టికి (Actress Krithi Shetty) కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook