Uppena collections record: ఉప్పెన. నిజంగానే కలెక్షన్ ఉప్పెన విరుచుకుపడుతోంది. మూడ్రోజుల్లోనే  30 కోట్లకు చేరువవుతోంది. మెగాస్టార్ తనయుడి తొలి సినిమా చిరుతను..మేనల్లుడి సినిమా కలెక్షన్లు దాటేశాయి. ఇంకెన్ని ఉప్పెనలు సృష్టిస్తుందో మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఉప్పెన సినిమా ( Uppena movie ) ఊహించని కలెక్షన్లు రాబడుతోంది. కరోనా తరువాత టాలీవుడ్‌కు అతి పెద్ద హిట్ ఇదే.  మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్  హీరోగా తెరంగేట్రం చేసిన ఉప్పెన బంపర్ హిట్‌గా నిలిచింది. ఊహించని రీతిలో కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి. కేవలం మూడ్రోజుల్లోనే దాదాపు 30 కోట్లకు చేరువలో ఉంది. మూడ్రోజుల్లోనే బయ్యర్లంతా సేఫ్ జోన్‌లో వచ్చి..లాభాలు అర్జిస్తున్నారు. మొదటి మూడ్రుజుల్లో 28 కోట్లు వసులు చేసిన ఉప్పెన..రికార్డు సృష్టిస్తోంది. కృతిశెట్టి హీరోయిన్‌గా తొలి సినిమా కావడం, సుకుమార్ ( Sukumar ) శిష్యుడు బుచ్చిబాబుకి దర్శకుడిగా తొలి సినిమా కూడా ఇదే. 


ఇక ఉప్పెన ( Uppena ) మరో రికార్డును తిరగరాసింది. ఇప్పటివరకూ డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించింది ఒకే ఒక సినిమా. అదే చిరుత. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ (Ram charan ) హీరోగా పరిచయమైన చిరుత..మూడ్రోజుల్లో 25 కోట్ల షేర్ వసూలు చేసింది. 14 ఏళ్ల తరువాత ఈ రికార్డును మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav tej )..ఉప్పెనతో బద్దలు కొట్టాడు. మూడే మూడు రోజుల్లో 28 కోట్ల షేర్ వసూలు చేసింది ఉప్పెన సినిమా. సినిమా యావరేజ్ టాక్ వచ్చినా..కలెక్షన్లు మాత్రం భారీగా ఉన్నాయి. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఉప్పెన. తొలి రెండు రోజుల్లోనే 20 కోట్లు వసూలు చేసిన ఉప్పెన...మూడో రోజు 8.2 కోట్లు వసూలు చేసింది. డెబ్యూ హీరోల్లో రామ్ చరణ్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్, నాగ్ చైతన్యలు ఎంట్రీ ఇచ్చినా చిరుత రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్ ఆ రికార్డును తన పేర రాసుకున్నాడు.


Also read: Uppena sequel: మరో ఉప్పెన రాబోతుందట..ఉప్పెన 2 కధ ఎలా ఉంటుందో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook