Urmila tweeted on Kangana comment: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది. తాజాగా ఆమె ఊర్మిళ మతోంద్కర్ (Urmila Matondkar) ఒక అడల్ట్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది. ఊర్మిళకు నటన రాదని పోర్న్ స్టార్‌గానే గుర్తింపు పొందిందని పేర్కొంది. ఇలా పేర్కొని కొత్త వివాదంలో చిక్కుకుంది కంగనా. దీంతో బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు, నెటిజన్లు కంగనా రనౌత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంగనా వ్యాఖ్యలపై ఇంకా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తనపై కంగనా చేసిన ఆరోపణలపై నటి ఊర్మిళ స్పందించింది. తనవైపు నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో తనకు మద్దుతు తెలిపిన రియల్ పీపుల్ ఆఫ్ ఇండియాకు.. ఎలాంటి పక్షపాతం లేని మీడియాకు ధన్యావాదాలు.. ఇది తప్పుడు ప్రచారంపై మీరు సాధించిన విజయం.. తన మనస్సుకు తాకింది.. జైహింద్ అంటూ ఊర్మిళ ట్విట్ చేసింది. Also read: Kangana Ranaut: ఆమెకు నటనే రాదు..ఆమె ఒక అడల్ట్ స్టార్


బాలీవుడ్‌లో సుశాంత్ మరణం ఆతర్వాత డ్రగ్స్ వ్యవహారం తదితర అంశాలపై కంగనా నిత్యం పదునైన వ్యాఖ్యలు చేస్తోంది. ఈ క్రమంలో ఊర్మిళ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా గురించి మాట్లాడుతూ.. బీజేపీ టికెట్ పొందేందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ.. కామెంట్ చేసింది. దీంతో కంగనా ఆమెపై ఫైర్ అయ్యింది. Also read: Jaya Prada: జయబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు