Jaya Bachchan ji is doing politics: Jaya Prada: న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో చాలామంది డ్రగ్స్‌కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్యలపై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు. కొంతమంది కావాలనే బాలీవుడ్ ( Bollywood ) ను కించపరుస్తున్నారంటూ.. రవికిషన్, కంగనా రనౌత్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్లమెంట్ సాక్షిగా రవి కిషన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద (Jaya Prada) సైతం సమర్థించారు.
I completely support Ravi Kishan ji's remarks about saving youth from the problem of drug trafficking/addiction. We need to raise our voice against the use of drugs & we need to save our youth. I think Jaya Bachchan ji is doing politics over the issue: Jaya Prada, BJP pic.twitter.com/VKaRkanlKq
— ANI (@ANI) September 16, 2020
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉచ్చు నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని జయప్రద చెప్పారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం గళం విప్పాలి.. మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ విషయంపై జయాబచ్చన్ అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారనుకుంటా అంటూ ఆమె విమర్శించారు. Also read: Amitabh Bachchan: బచ్చన్ ఇంటికి మరింత భద్రత
అయితే.. బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటి నుంచి బాలీవుడ్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో తాజాగా పార్లమెంటులో రవికిషన్ వ్యాఖ్యలను జయాబచ్చన్ తప్పుపట్టిన అనంతరం.. కంగనా రనౌత్ ఆమెను విమర్శిస్తూ ట్విట్ చేసింది. అనంతరం జయబచ్చన్‌పై జయప్రద కూడా విమర్శలు గుప్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు