OTT Releases: ఆదికేశవ.. కోటబొమ్మాళి పీఎస్.. అప్పటి నుంచే ఓటిటిలోకి..
Aadhi Keshava OTT: ఈవారం విడుదలైన “ఆదికేశవ”, “కోట బొమ్మాళి పిఎస్” రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపివ్వడం లేదు. దీంతో అప్పుడే ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది..
Kotabommali PS OTT: ఈ శుక్రవారం తెలుగు సినీ ప్రేక్షకులకు నిరాశె మిగిలింది ఈవారం విడుదలైన రెండు సినిమాలు “ఆదికేశవ”, “కోట బొమ్మాళి పిఎస్” నవంబర్ 24న విడుదల అయ్యి థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయాయి. దీంతో అప్పుడే నెటిజన్లలో ఈ రెండు సినిమాలు ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమ్ అవుతాయి ? అనే చర్చ మొదలైంది.
ఈ రెండు సినిమాలలో ముందుగా అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఆదికేశవ అని చెప్పాలి. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఆది నుంచి అంతమే వచ్చింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ చిత్రం పైన ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. దానికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్.. పోస్టర్.. టీజర్ ట్రైలర్ అన్ని కూడా ఈ చిత్రంపై ప్రేక్షకులలో నెగిటివ్ విబ్సే క్రియేట్ చేస్తూ వచ్చాయి. తప్పకుండా ఈ సినిమా పరమ రొటీన్ మాస్ సినిమా అని ఈ చిత్రం ట్రైలర్ చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది. అందుకే ఈ చిత్రం ఫ్రీ బుకింగ్ కూడా చాలా దారుణంగా కొనసాగాయి. ఇక చిత్రం విడుదలయ్యాక అందరూ అనుకున్నట్టే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. ప్రస్తుతం ఈ చిత్ర థియేటర్స్ దగ్గరకి పోవడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపియడం లేదు.
ఇక ఈ సినిమాతో పాటు విడుదలైన మరో తెలుగు సినిమా కోట బొమ్మాలి పిఎస్. ఇక ఈ చిత్రంలో లింగిడి లింగిడి పాత యూట్యూబ్లో విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాపై కొద్దిగా ఆశలు మొదలయ్యాయి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ “నాయట్టు” మూవీకి రీమేక్ గా వచ్చింది. కాగా ఆదికేశవ సినిమా కన్నా ఈ చిత్రం చాలా బెటర్ అని.. ఒకసారి అయితే ఈ చిత్రాన్ని చూసేయచ్చని చూసిన ప్రేక్షకులు తెలుపుతున్నారు. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాక్ పరంగా పరవాలేదు అనిపించుకుంటూ ఉన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా జోరు చూపి పదం లేదు. మొత్తానికి ఏదేమైనా ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ కు నిరాశ తప్పలేదు.
కాగా థియేటర్ రిలీజ్ కు ముందే ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ వివరాలకు వస్తే ఆదికేశవ మూవీని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫిక్స్ సొంతం చేసుకోగా, కోట బొమ్మాలి సినిమాని ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలను కూడా డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ చెయ్యడానికి ఓటిటి సంస్థలు అగ్రిమెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎలా డిసెంబర్ 1న యానిమల్ ఆ తరువాత డిసెంబర్ 7న హాయ్ నాన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఈ చిత్రాల థియేటర్ రన్ డిసెంబర్ మొదటి వారంలోనే ముగిసిపోతుంది అని విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి ముందుగా డిసెంబర్ 2, 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తాయా లేదా డిసెంబర్ చివరి వారంలో వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook