హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తూ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘వకీల్ సాబ్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్లుగానే పవన్ ట్రెండ్ ఫాలో కాడు.. ట్రెండ్ క్రియేట్ చేస్తాడంటూ ఇంటర్నెట్‌లో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నిరూపించింది. ఈ క్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వకీల్ సాబ్ మూవీ నుంచి మగువా మగువా లిరికల్ సాంగ్ విడుదల చేసింది మూవీ యూనిట్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..


మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని వర్ణించే మగువా మగువా పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన  ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా’ అంటూ సాగే ఈ అద్భుతమైన పాటను సింగ్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు.


ఆ పాట మీకోసం...



Also Read: దక్షిణాదిన ఒకే‘ఒక్కడు’ మహేష్ బాబు


అల వైకుంఠపురములో సినిమాతో మ్యూజికల్ హిట్స్ అందుకున్న థమన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సామజవరగమన, రాములో రాములా.. అంటూ తన సంగీతంతో ఉర్రూతలూగించిన థమన్.. తాజాగా వకీల్ సాబ్ మూవీతోనూ మ్యాజిక్ చేస్తున్నాడు. సామజవరగమనతో ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్.. ఈ మగువా మగువా పాటను అంతకంటే శ్రద్ధగా ఆలపించి ఆకట్టుకున్నాడు.


See Pics: బాలీవుడ్ బ్యూటీతో బైక్‌పై విజయ్ చక్కర్లు


హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ ఈ వకీల్ సాబ్. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ఇప్పుడు పవన్ కల్యాణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్‌లు వకీల్ సాబ్‌ను నిర్మిస్తున్నారు. నివేదా థామస్ కీలకపాత్రలో నటిస్తోంది.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..