పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల అనంతరం పాలిటిక్స్ నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చాక సైన్ చేసిన మొదటి సినిమా వకీల్ సాబ్ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని పవన్ కల్యాణ్ చేస్తోన్న సినిమా అవడంతో ఎప్పుడెప్పుడు ఆయన్ను బిగ్ స్క్రీన్‌పై చూడాలా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కల్యాణ్ అభిమానులను వకీల్ సాబ్ మూవీ ఎంత ఊరిస్తుందో... వకీల్ సాబ్ టీజర్ సైతం అంతే ఊరిస్తోంది. దసరా, దీపావళి పండగ సమయంలోనే వకీల్ సాబ్ టీజర్ విడుదలవుతుందని భావించారు కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత వినిపించిన టాలీవుడ్ టాక్ ప్రకారం కొత్త సంవత్సరం కానుకగా వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. 


Also read : Bigg Boss contestant Avinash: అభిజీత్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు


ఇదిలావుండగా తాజాగా మరో టాక్ తెరపైకొచ్చింది. న్యూ ఇయర్‌కి విడుదలవుతుందనుకున్న టీజర్ కాస్తా సంక్రాంతి పండగకి ( Sankranti 2021 ) వాయిదా పడినట్టు టాక్. ఈసారి అయినా టీజర్ విడుదలవుతుందా లేదా అని పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా పవన్ కల్యాణ్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తోంది.


Also read : Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook