Varun Sandesh Interview: హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్.  ఆ తర్వాత కొత్త బంగారులోకం.. సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రెండు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో.. ఒకప్పుడు వరుణ్ సందేశ్.. స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్లతో.. వరుణ్ సందేశ్ మార్కెట్ బీభత్సంగా పడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015లో పడ్డానండి ప్రేమలో.. మరి అనే సినిమా సమయంలో వితికాతో.. ప్రేమలో పడిన.. వరుణ్ సందేశ్ ఆమెని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి బిగ్ బాస్ కి.. కూడా వచ్చారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్ తన భార్యకి.. తను ఒకసారి అబద్ధం చెప్పి దొరికిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. 


"ఒక చిన్న అబద్ధం చెప్పి దొరికిపోయా. నేను ఒకసారి.. ఒక కేసీనోకి వెళ్ళాను. నేను కేసీనోకి వెళ్లడం వితికాకి.. అసలు నచ్చదు. అందుకే నేను కేసీనోకి వెళ్తున్నాను అన్న విషయం చెప్పకుండా.. రెస్టారెంట్ కి వెళ్తున్నాను అని చెప్పాను. అయితే సడన్ గా వితికా నుంచి.. వరుసగా కాల్స్ మీద కాల్స్.. వస్తున్నాయి. నా ఫోన్ టేబుల్ మీద ఉంది" అంటూ ఆరోజు జరిగిన దాన్ని.. గుర్తు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. 


"టేబుల్ మీద ఉన్నప్పుడు ఫోన్ తీయకూడదు. కాబట్టి పక్కకి వచ్చి.. ఏమైంది వితిక అని అడిగితే.. ఎక్కడున్నావ్ సందు అని అడిగింది. ఆల్రెడీ చెప్పాను కదా.. నీకు అని అంటుంటే.. తను వినిపించుకోకుండా మళ్ళీ ఎక్కడున్నావని అడిగింది. నాకు టెన్షన్ వచ్చేసింది. ఈలోపు తను నేను కెసీనో టేబుల్ మీద.. ఉన్న ఫోటో నాకు పంపించింది. అది చూసి నేను షాక్ అయిపోయాను" అని అన్నారు వరుణ్ సందేశ్. 


"అసలు నువ్వు ఎక్కడున్నావ్.. అని నేను అడిగాను. కట్ చేస్తే నేను టేబుల్ మీద ఉన్నప్పుడు.. నా ఎదురుగా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరు నన్ను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో వితికాకి పంపించి హలో వితికా గారు.. మీ హస్బెండ్ ఇక్కడ ఉన్నారు.. ప్లీజ్ మాతో ఫోటో దిగమని చెప్పండి అని అన్నారు. నేను వాళ్ళ ఎదురుగానే ఉన్న కదా.. అదేదో నాకే చెబితే నేనే దిగే వాడిని కదా.." అంటూ జరిగిన విషయాన్ని అందరితో పంచుకున్నారు వరుణ్ సందేశ్. 


2023లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో.. నటించిన వరుణ్ సందేశ్.. తాజాగా ఇప్పుడు.. మరొక మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో.. నిజ జీవితంలో జరిగిన మర్డర్ కేస్ ఆధారంగా తెరకెక్కుతున్న నింద సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమాలలో ఒకటైనా హిట్ అయి.. వరుణ్ సందేశ్ కి మరిన్ని ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter