Mega Wedding:వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఇటలీలో వివాహ బంధంతో ఈరోజుతో  ఒక్కటి అవుతున్నారు. పెళ్ళికి ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో మెగా ఫ్యామిలీ, సన్నిహితులు సందడి చేశారు. నిన్నటి వరకు వీరి కాక్టైల్ ఫోటోలు వైరల్ కాదా ఇప్పుడు వీరి మెహందీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హల్దీ వేడుకలో కొత్త జంటతో చిరంజీవి, సురేఖ దంపతులు, నాగబాబు దంపతులు , అల్లు అర్జున్ దంపతులు అలానే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సందడి చేశారు.


ఇక నిన్న రాత్రి వీరిద్దరి మెహందీ ఫంక్షన్ జరగగా ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో వరుణ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్.. తో పాటు మెగా ఫ్యామిలీ అలానే లావణ్య ఫ్యామిలీ ఫోటోలు హైలెట్ గా నిలిచాయి. 


 



కాగా వీరిద్దరూ ఈరోజు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని ఒకతవబోతున్నారు అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇరువురి కుటుంబసభ్యులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇటలీ చేరుకున్నారు.ఇక ఈరోజు మరికొంత మంది సెలబ్రెటీలు, వరుణ్, లావణ్య స్నేహితులు ఇటలీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సమంత, చైతన్యతోపాటు పలువురు సెలబ్రెటీలు వరుణ్, లావణ్య పెళ్లికి హాజరుకానున్నారు.


ఇక నిన్న వచ్చిన వీరి హల్దీ ఫోటోలను పసుపు వర్ణం దుస్తుల్లో లావణ్య, వరుణ్ తేజ్ మెరిసిపోయారు. లావణ్య పసుపు కలర్ లెహంగా ధరించగా.. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంట్ ధరించారు. ఈ హల్దీ వేడుకకు థీమ్ ను పసుపు, తెలుపు రంగుల్లో డిజైన్ చేశారు. మెగా హీరోలు అలానే అల్లు హీరోలు కూడా అదే టీం డ్రెస్సుల్లో కనిపించారు.


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook