Varun Tej Lavanya Tripathi Marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడని టాలీవుడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమాయణం సాగినట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లాడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె కోసం హీరో వరుణ్ తేజ్ ఏకంగా రూ.25 లక్షల విలువైన ఉంగరం కొన్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం (జనవరి 19) వరుణ్ బర్త్ డే సందర్భంగా లావణ్యను కలిసేందుకు వరుణ్ బెంగళూరు వెళ్లినట్లు ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు. ఇప్పుడీ రూమర్లపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరోక్షంగా స్పందించింది. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. 


ఏం జరిగిందంటే?


హీరో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా చేసిన 'మిస్టర్‌', 'అంతరిక్షం' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది నటి లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్‌ తేజ్ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య త్రిపాఠి కూడా హాజరయ్యింది. 


దీంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. కానీ ఆ తర్వాత ఎలాంటి పుకార్లూ రాలేదు. బుధవారం (జనవరి 19) వరుణ్‌ పుట్టిన రోజు కావడంతో, వేడుకల కోసం వరుణ్‌ బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీంతో పుకార్ల తాకిడి మళ్లీ మొదలైంది.


లావణ్య త్రిపాఠితో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ తేజ్ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ని కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు ఆ నోట ఈ నోట పడి లావణ్య దగ్గరకి చేరినట్లున్నాయి. దీంతో వాటిపై సోషల్‌ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించింది లావణ్య త్రిపాఠి. 


డెహ్రాడూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రకృతి అందాలు తన మనసుని కట్టిపడేస్తున్నాయని ఆ ఫొటోలతోపాటు పోస్టులో రాసుకొచ్చారు. లావణ్య షేర్‌ చేసిన కొత్త ఫొటోలతో ఆమె పెళ్లి, ప్రేమ వార్తలకు మరోసారి చెక్‌ పెట్టినట్లు అయ్యింది. అయితే ఈ వార్తలపై హీరో వరుణ్ తేజ్ స్పందించాల్సి ఉంది.  


Also Read: Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!


Also Read: Varun Tej Ghani: వరుణ్​తేజ్ బర్త్​డే...'పవర్​ ఆఫ్ గని' పేరుతో సర్​ప్రైజ్​ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook