Varun Tej Ghani: వరుణ్​తేజ్ బర్త్​డే...'పవర్​ ఆఫ్ గని' పేరుతో సర్​ప్రైజ్​ వీడియో

Varun Tej Birthday: మెగాహీరో వరుణ్​తేజ్ బర్త్​డే కానుకగా 'గని' నుంచి స్పెషల్ సర్​ప్రైజ్ వచ్చేసింది. 'పవర్​ ఆఫ్ గని' పేరుతో వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 01:18 PM IST
  • నేడు వరుణ్​తేజ్ బర్త్​డే
  • సర్​ప్రైజ్​ ఇచ్చిన గని టీమ్
  • 'పవర్​ ఆఫ్ గని' పేరుతో స్పెషల్ గ్లింప్స్
Varun Tej Ghani: వరుణ్​తేజ్ బర్త్​డే...'పవర్​ ఆఫ్ గని' పేరుతో సర్​ప్రైజ్​ వీడియో

Varun Tej Ghani movie Update: నేడు మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్ బర్త్​డే (Varun Tej Birthday). ఈ సందర్భంగా 'గని' సినిమా నుంచి 'పవర్​ ఆఫ్ గని'  (power of ghani ) పేరుతో సర్​ప్రైజ్​ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో బాక్సర్​ గా వరుణ్ లుక్ అదిరిపోయింది. 28 సెక‌న్లు మాత్ర‌మే ఉన్న ఈ వీడియాలో వ‌రుణ్ తేజ్ పంచ్ లతో విరుచుకుపడుతున్నాడు. చివ‌ర్లో సీరియ‌స్ లుక్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ ను చూస్తే.. నిజ‌మైన బాక్స‌ర్ ల కనిపిస్తున్నాడు. 

మార్చి 18న ఈ సినిమా (Ghani movie) థియేటర్లలోకి రానుంది. వరుణ్​తేజ్ సరసన సయీ మంజ్రేకర్ ( Saiee M Manjrekar) హీరోయిన్​గా నటిస్తోంది. తమన్నా ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసింది. ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, సునీల్ శెట్టి, ఉపెంద్ర‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. సాయి కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు బాబీ-సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటే 'ఎఫ్3' టీమ్​ కూడా వరుణ్​తేజ్​కు విషెస్​ చెబుతూ పోస్టర్​ రిలీజ్ చేసింది.

Also Read: Sarkaru vaari paata first review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ

ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ (Boxer) పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సిక్స్ ప్యాక్ చేశారు. బాక్సింగ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రూపొందించడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News