Chiranjeevi: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!
Varun Tej: మెగాస్టార్ వెనక అడుగులు వేస్తూ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలబడ్డ మెగాస్టార్ సలహాలు వీళ్ళకి ఎంతో అవసరం అయ్యేలా కనిపిస్తున్నాయి.
Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగా హీరోలు ఎందరో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం వీరి కెరీర్లు ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ కుర్ర హీరోల సినిమాలు వరుస డిజాస్టర్ లు కావడంతో మార్కెట్ వాల్యూ బాగా పడిపోయింది. నిర్మాణంలో ఉన్న సినిమాలు కూడా బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే మూడు చేదు అనుభవాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
అతను నటించిన గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడి మరి డిజాస్టర్స్ రికార్డులు సృష్టించాయి. ఈ మూడు చిత్రాలు ఉత్పత్తి యంగ్ హీరోలలో ఎవరు చవిచూడనంత వరస్ట్ రికార్డులు తెచ్చుకున్నాయి. మరోపక్క వైష్ణవి తేజ్ పరిస్థితి కూడా ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఉప్పెన చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ ఎంట్రీ అందుకున్న హీరో వైష్ణవ తేజ్. అయితే ఆ తర్వాత నుంచి వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. అతను నటించిన కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ మూడు సినిమాలు మూడు రకాల డిజాస్టర్స్ గా మిగిలాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా హీరోల మార్కెట్ చాలా రిస్కీ గా ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఇద్దరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆలోచనలు పడే పరిస్థితులు నెలకొన్నాయి. వీరిద్దరి సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చినా కానీ తీవ్ర నష్టాలు చవిచూడక తప్పవేమో అని నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు.
ఇక ప్రస్తుతం అటు ఇటుగా ఇదే పరిస్థితిలో ఉన్న మరొక మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ. విరూపాక్ష మూవీ తో మాంచి హిట్ అందుకున్నాడు కానీ ఆ తర్వాత మాత్రం మరొక మూవీ లేక ఆగిపోయాడు. భారీ అంచనాల మధ్య మొదలైన గాంజా శంకర్.. అనుకోని కారణాలవల్ల ఆగిపోవడం అతని కెరీర్ కు పెద్ద షాక్. ఈ మూవీ మొత్తానికే క్యాన్సిల్ అయ్యిందా లేక ప్రస్తుతానికి పెండింగ్లో ఉందా అన్న విషయంపై కూడా మైత్రి వారు పెదవి విప్పడం లేదు. మరోపక్క అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇదే రకమైన సిచువేషన్ ని ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్, అల్లు అరవింద్.. ఇలా ఇద్దరి స్ట్రాంగ్ బ్యాకప్ ఉన్నప్పటికీ అతను ఇంకా కెరీర్ లో నిడదొక్కుకోలేదు. ప్రస్తుత నటిస్తున్న టెడ్డి చిత్రం ఎప్పటికీ పూర్తవుతుంది అన్న విషయం పై ఎవరికీ క్లారిటీ లేదు.
ప్రస్తుతం ఉన్న మెగా హీరోస్ అందరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత ఆ రెంజ్ స్టార్ట్ డమ్ అందుకుంటున్న నెక్స్ట్ యాక్టర్ రామ్ చరణ్ మాత్రమే. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా..తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో పవన్ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇక రాజమౌళి పుణ్యమా అని మగధీర చిత్రంతో స్టార్ హీరోగా నిలబడిన రామ్ చరణ్…ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ హీరో అయిపోయారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కూడా సూపర్ సక్సెస్ తో సాగిపోతూ ఉండగా ఆయన్ని చాలామంది మెగా కాంపౌండ్ హీరో కన్నా అల్లు హీరో గానే లెక్కల్లో వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుత యువ హీరోల్లో రామ్ చరణ్ తప్ప మెగా కాంపౌండ్ హీరోలు ఒక్కరు కూడా ఎక్కువ కాలం నిలబడేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో మెగా లెగసి కొనసాగించాలి అంటే మెగా హీరోలు అందరికీ చిరంజీవి సలహాలతో పాటు సూచనలు చాలా అవసరమయ్యేలా ఉంది. ఇప్పటికన్నా చిరంజీవి రంగంలోకి దిగి వీరి స్టోరీ సెలక్షన్స్ లో కాస్త ఇంట్రెస్ట్ చూపించి వీరందరికీ సినిమా ఇండస్ట్రీలో ఒక దోవ చూపిస్తారేమో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి