saddam Taxi Movie : `టాక్సీ` ప్రయాణం ఎలా ఉందంటే?.. సద్దాం కామెడీ చూద్దాం అనేలా!
Taxi Movie review వసంత్ సమీర్ పిన్నమరాజు, సౌమ్య మీనన్ కాంబోలో టాక్సీ సినిమా నేడు విడుదలైంది. ఈ చిత్రంలో సద్దాం కామెడీ హైలెట్ అయ్యేలా ఉండటంతో ఎక్కువగా బజ్ ఏర్పడింది. నేడు ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ను అందరూ చేపడుతున్నారు. సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా చేయడం కోసం టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్స్ అంటూ వదులుతుంటారు. ఇలా టాక్సీ సినిమా టీజర్, ట్రైలర్‌లతో అందరినీ మెప్పించింది. అరుదైన ఖనిజం కాలిఫోర్నియం 252 చుట్టూ తిరిగే కథ అవ్వడంతో అందరి దృష్టి పడింది. అసలు ‘కాలిఫోర్నియం 252’ అంటే ఏమిటి ? ఈ టాక్స్ రైడ్ ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? అనేది ఓ సారి చూద్దాం.
కథ
టాక్సీ కథ రెండు కారెక్టర్స్ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. అందులో ఒక పాత్ర సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు). ఇంకోటి హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్). తాను చేసిన ప్రయోగాలే తనకు శత్రువులా మారుతాయ్ ఈశ్వర్‌కు. ఇక కెరీర్‌లో ఎదిగేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు హ్యాకర్ ఉజ్వల్‌ను చిక్కుల్లో పడేస్తాయి. ఈ ఇద్దరూ కలిసి ఓ సారి టాక్సీ ఎక్కుతారు. ఆ ట్యాక్సీ డ్రైవర్ సద్దాం. ఆ తరువాత వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? సైంటిస్ట్ ప్రయోగాల ఫలితం ఏంటి? హ్యాకర్ ఉజ్వల్‌కు వచ్చిన చిక్కులేంటి? చివరకు కథ ఎలాంటి ముగిసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
నటీనటులు
హీరో సైంటిస్ట్ పాత్రలో వసంత్ సమీర్ పిన్నమ రాజు చక్కగా నటించాడు. తెరకు కొత్తవాడైనా ఎక్కడా తడబకుండా మెప్పించాడు. పక్కింటి కుర్రాడిలా అందరినీ ఆకట్టుకుంటాడు. హీరోయిన్ సౌమ్య మీనన్ కనిపించినంత సేపు అందంగా అనిపిస్తుంది. కమిడియన్ సద్దాం హుస్సేన్ కామెడీ వర్కౌట్ అవుతుంది. అలా మిగిలిన పాత్రల్లో అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత ఇలా అంతా కూడా ఓకే అనిపిస్తారు.
విశ్లేషణ
సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లు తీస్తూనే కొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం చాలా కష్టమే. అసలే ఇప్పుడు ఓటీటీలో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలోనే టాక్సీ అనే సినిమా వచ్చింది. టాక్సీ ఎక్కిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను వారి గతం ఎలా వెంబడించింది? ఒకరికొకరు తెలియకుండా టాక్సీ ఎక్కినా.. ఒకరి జీవితం ఇంకొకరి జీవితంతో ఎలా ఇంటర్ లింక్ అయ్యి ఉంది? అనేటువంటి ఆసక్తికరమైన ట్విస్ట్‌లు అందరినీ మెప్పిస్తాయి.
ఫస్ట్ హాఫ్‌లో ఉన్న చిక్కులన్నీ కూడా సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా విప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉరుకుండారెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్, మార్క్ k రాబిన్ నేపధ్య సంగీతం సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదని ప్రతీ సీన్, షాట్ చెబుతుంది. ఫైట్స్, చేజింగ్ సీన్స్, డైలాగులు అన్నీ కలిసి వచ్చేలానే ఉన్నాయి.
ఇక కొత్త దర్శకుడు హరీష్ సజ్జా ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ లైన్ కొత్తగానే అనిపించినా.. దాన్ని ప్రేక్షకుడికి చేరేలా తీయడంలో కాస్త గందరగోళానికి గురైనట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడున్న సాంకేతికతకు మోసాన్ని ముడిపెడుతూ ఓ డిఫరెంట్ కథాంశాన్ని రాసుకోవడం మెచ్చుకోదగ్గ విషయం.
Also Read: Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్
Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook