Bigg Boss Vasanthi Buzz Interview : బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వసంతిని శివ ఆడేసుకున్నాడు. బజ్ ఇంటర్వ్యూలో నానా రకాలుగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. వాటికి వసంతి సైతం దిమ్మతిరిగేలా సమాధానాలు ఇచ్చింది. అందంలో బుట్టబొమ్మ.. ఆటలో ఉత్త బొమ్మ అంటూ ఎంట్రీలోనే వసంతి పరువుతీశాడు యాంకర్ శివ. ఎలిమినేషన్ అయ్యావ్.. ఇంత కూడా బాధపడటం లేదు అని యాంకర్ శివ అంటే.. ఫేస్ మీద కనిపిస్తేనే బాధ అని కాదు.. లోపల కూడా ఉంటది అని వసంతి రిప్లై ఇచ్చింది. వసంతి ఆర్మీ, వసంతి ఫ్యాన్స్ అని ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి మీరేం చేశారు అని యాంకర్ శివ అంటే.. అది మీరే చెప్పాలి.. నేను ఇప్పుడే బయటకు వచ్చాను అని అంటుంది. వసంతి మేకప్ వేసుకుని, నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఇంక గేం ఏమీ ఆడలేదు అని శివ అంటాడు. బిగ్ బాస్ ఇంటికి ఏమేం కావాలో అన్నీ చేశాను అని వసంతి చెబుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాకు బిగ్ బాస్ ఇంట్లో ఎవ్వరి సపోర్ట్ లేదు అని వసంతి.. ఎవరి సపోర్ట్ కావాలి.. లోపల ఎవరు సపోర్ట్‌తో ఆడుతున్నారు అని శివ అడుగుతాడు. శ్రీహాన్, సత్య కలిసి ఆడుతున్నారు అని వసంతి చెబుతుంది. ఇంట్లోకి వెళ్లేముందు చాలా అల్లరి చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని అన్నావ్.. ఏం చేశావ్ నువ్.. ఏం ఎంటర్టైన్ చేశావ్.. అల్లరి చేశావ్ అని శివ అడిగేస్తాడు. ఏం చేయకపోతే జనాలకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండేదాన్ని కాదు అని వసంతి అంటుంది.


 



ఇన్ని రోజులు నెట్టుకొస్తానని అనుకున్నావా? అని శివ అడిగితే.. అనుకున్నాను.. ఇంకా ఉంటానని కూడా అనుకున్నా అని వసంతి చెబుతుంది. ఏం చూసుకుని ఉంటానని అనుకున్నావ్ అని శివ అడుగుతాడు. అక్కడ ఎవరు ఏం చూసుకుని ఉండాలని లేదు అని వసంతి చెబుతుంది. వందుకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావ్ అని అడిగితే.. డెబ్బై అని చెబుతుంది వసంతి. ఎందుకు వంద ఇచ్చుకోలేరా? అని శివ ఎదురు ప్రశ్నిస్తాడు.


నాకు కాన్ఫిడెన్స్ఉంది.. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అని వసంతి చెబుతుంది. నామినేషన్లో మాత్రమే ఎందుకు కోపంగా ఉంటావ్.. వారం అంతా ఆ ఫైర్ ఎందుకు ఉండదు.. అని శివ అడుగుతాడు. ఇనయలాగా ప్రతీ దాంట్లో దూరమంటావా? అని శివను వసంతి రివర్స్ అడుగుతుంది. ఆమె దూరుతుందా? అని శివ అడిగితే.. అవునని అంటుంది. బిగ్ బాస్ షోకు ఎందుకు వచ్చారు అని అడిగితే.. ఫేమ్ కోసం అని చెబుతుంది వసంతి. అది వచ్చిందని అనుకుంటున్నారా? అని శివ అడిగితే.. ఏమో అన్నట్టుగా తలూపింది వసంతి.


Also Read : Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు


Also Read : Sudigali Sudheer Gaalodu : ఈ వారం రాబోతోన్న సినిమాలివే.. చిన్న చిత్రాల సందడి.. ఓటీటీలో గాడ్ ఫాదర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook