Veer Shankar elected as Telugu Film Directors Association President: 'గుడుంబా శంకర్' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వీర శంకర్.. తాజాగా తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బజార్ ఈయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. దర్శకులు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వీర శంకర్ మాట్లాడుతూ.. త్వరలో కాపీ రైట్స్, మార్కెటింగ్, ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తదితర అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలె తెలుగు సినిమా దర్శకుల సంఘం ప్రెసిడెంట్‌గా భారీ మెజార్టీతో గెలుపొందారు వీర శంకర్. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు పడుతున్న ఇబ్బందులను పరిష్కారం దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రొడ్యూసర్ బజార్.. సహ వ్యవస్థాపకులు ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ కొత్తగా ఎన్నికైన దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వీర శంకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సహకారంతో నిర్మాతల ప్రయోజనాల పరిధిని విస్త్రత పరచడమే లక్ష్యంగా ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన అవగాహన సదస్సును ప్రశంసించారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్. ఇక దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ఆ తరహా సదస్సును నిర్వహించాలన్న ప్రతిపాదనకు సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రొడ్యూసర్ బజార్ కో ఫౌండర్ & సి.బి.ఓ.డి. విజయ్ ఈ సందర్భంగా వీర శంకర్ కృతజ్ఞతలు తెలియజేసారు. నిర్మాతల ప్రయోజనాలకు తమ సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంటుందన్న విజయ్.. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌లకు ప్రొడ్యూసర్ బజార్ ఎపుడు అందుబాటులో ఉంటుందున్నారు.


దర్శకుడు వీర శంకర్ విషయానికొస్తే.. తెలుగులో శ్రీకాంత్ హీరోగా 'హలో ఐ లవ్ యూ' మూవీతో దర్శకుడిగా పరిచయ్యారు. ఆ తర్వాత ప్రేమ కోసం, విజయరామరాజు, పవన్ కళ్యాణ్‌తో 'గుడుంబా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అటు కన్నడ ఇండస్ట్రీలో 'నమ్మ బసవ', అంతు ఇందు ప్రీతి బంతు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తెలుగులో 'మన కుర్రాళ్లే, యువరాజ్యం సినిమాలను డైరెక్ట్ చేసారు. అటు నటుడిగా జాతి రత్నాలు వంటి పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook