Veera Simha Reddy 11 Days Total Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన మలయాళ హీరోయిన్ హనీ రోజ్ అలాగే శృతిహాసన్ నటించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదలై 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 11 రోజుల పాటు వసూళ్లు ఎలా ఉన్నాయనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. ఇక తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల 39 లక్షల షేర్, 102 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 11వ రోజు సుమారు కోటి 44 లక్షల షేర్ రెండు కోట్ల 24 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎనిమిదవ రోజు తర్వాత 9, 10 రోజుల్లో కోటి రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదు.


కానీ 11వ రోజు కోటిన్నర వరకు కలెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక వీకెండ్ కలిసి రావడంతో 11వ రోజు గట్టిగానే వసూలు చేసింది ఈ సినిమా. ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా 11 రోజులకు గాను నాలుగు కోట్ల 75 లక్షలు వసూలు చేస్తే ఒక్క ఓవర్సీస్ లోనే ఐదు కోట్ల 70 లక్షలు వసూలు చేసింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 73 కోట్ల 84 లక్షల షేర్ వసూలు చేయగా 124 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ఇక ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా 74 కోట్లు నిర్ణయించారు ట్రేడ్ వర్గాల వారు. ఇక ఈ సినిమా ఇంకా 16 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా విడుదలయ్యేందుకు మరో రెండు రోజులు ఉండడంతో ఈ రెండు రోజుల్లో 16 లక్షలు వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదని కచ్చితంగా బాలకృష్ణ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Akkineni Thokkineni: బాలయ్య నోటి వెంట 'అక్కినేని తోక్కినేని'..వర్దంతి రోజే ఘోర అవమానమా?


Also Read: Vaarasudu Collections: దిల్ రాజుకు షాక్.. వారసుడు బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎందుకో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook