Vaarasudu Collections: దిల్ రాజుకు షాక్.. వారసుడు బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎందుకో తెలుసా?

Vaarasudu 9 Days Collections: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో విడుదలై 9 రోజులు పూర్తయ్యాయి, ఈ క్రమంలో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.  

Last Updated : Jan 23, 2023, 12:51 PM IST
Vaarasudu Collections: దిల్ రాజుకు షాక్.. వారసుడు బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎందుకో తెలుసా?

Vijay Vaarasudu 9 Days Telugu Collections: విజయ్ హీరోగా తమిళంలో వారిసు అనేది సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమాని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తూ ఉండడంతో ముందుగా దీన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామని సినిమా ప్రారంభించినప్పుడే ప్రకటించారు. అయితే మధ్యలో తెలుగు సినిమాల షూటింగ్స్  ఆగిపోవడంతో ఇది తమిళ సినిమా అని చెబుతూ తెలుగులో డబ్బింగ్ సినిమాగా విడుదల చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించడమే కాక షూట్ కూడా జరుపుకున్నారు.

అలాగే తమిళనాడులో తమిళ సినిమాలకు ఉన్న బెనిఫిట్స్ వాడుకునేందుకు దాన్ని పూర్తిగా తమిళ్ సినిమాగానే చేసేసారు అనే వాదన ఉంది. సరే ఏదేమైనా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ముందుగా తమిళంలో జనవరి 11వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమాని తెలుగులో 14వ తేదీన వారసుడు పేరుతో విడుదల చేశారు. అయితే అప్పటికే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న మేర వసూళ్లు రాకపోయినా కొంత మీరు ఇబ్బంది లేకుండానే బయటపడింది.

ఇక ఈ సినిమా ఇప్పటివరకు తొమ్మిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా ఆ తొమ్మిది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 13 కోట్ల 98 లక్షల షేర్ వసూలు చేసింది. అలాగే పాతిక కోట్ల పదిలక్షల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 14 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్  అవ్వాలంటే 15 కోట్లు రాబట్టాలి. కానీ ఇంకా ఈ సినిమా కోటి రూపాయల రెండు లక్షలు సాధించాల్సి ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ మేర వసూళ్లు రాబట్టడం కష్టమైన విషయమే, ఎందుకంటే ఇప్పటికే దాదాపు రెండు వీకెండ్స్ పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి సోమవారం వీక్ డేస్ మొదలవుతాయి, వీక్ డేస్ లో సినిమాలకు వెళ్లి చూసేవాళ్ళు చాలా తక్కువ. దానికి తగ్గట్టు 25వ తేదీ నుంచి షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదలవుతోంది. 26వ తేదీ కూడా కొన్ని చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపద్యంలో వారసుడు సినిమా బ్రేక్ ఈవెన్ చేయడం కష్టమేనని అంచనాలు వెలువడుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Also Read: Balakrishna L Word: బాలకృష్ణ నోటి వెంట బూతు పదం... డీజే టిల్లు రియాక్షన్ చూశారా?

Also Read: Akkineni Thokkineni: బాలయ్య నోటి వెంట 'అక్కినేని తోక్కినేని'..వర్దంతి రోజే ఘోర అవమానమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News