Veera Simha Reddy 9 Days Collections: కలెక్షన్స్ లో దారుణంగా డ్రాప్..ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే?
Veera Simha Reddy Day 9 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Veera Simha Reddy 9 Days Total Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే సినిమా రూపొందింది. హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలయి ఇప్పటికే 9 రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయనే విషయం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
ఈ సినిమా మొదటి రోజు పాతిక కోట్ల 35 లక్షలు, రెండవ రోజు 5 కోట్ల 25 లక్షలు, మూడవరోజు ఆరు కోట్ల 45 లక్షలు, నాలుగవ రోజు ఏడు కోట్ల 25 లక్షలు, 5వ రోజు 6 కోట్ల 25 లక్షలు, ఆరవ రోజు నాలుగు కోట్ల 80 లక్షలు, ఏడవ రోజు మూడు కోట్ల పదహారు లక్షలు, ఎనిమిదవ రోజు కోటి 53 లక్షలు వసూలు చేసింది. ఇక తొమ్మిదవ రోజు నైజాం ప్రాంతంలో 20 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 20 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా 14 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా ఎనిమిది లక్షలు, గుంటూరు ఆరు లక్షలు, కృష్ణాజిల్లా ఆరు లక్షలు, నెల్లూరు జిల్లా ఐదు లక్షలు వెరసి మొత్తం 94 లక్షల షేర్ ఒక కోటి 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
అలా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల 98 లక్షల షేర్ 98 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తొమ్మిది రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి నాలుగు కోట్ల 58 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో ఐదు కోట్ల 58 లక్షలు వసూలు చేసింది. ఇక అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 71 కోట్ల 14 లక్షల షేర్ వసూలు చేస్తే 119 కోట్ల పాతిక లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 73 కోట్లకు జరగడంతో 74 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇంకా రెండు కోట్ల 86 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.
Also Read: Dil Raju Sankranthi Race: మరోసారి సంక్రాంతి రేసుకు సిద్దమవుతున్న దిల్ రాజు.. ఈసారి కూడా 'మైత్రీ'తోనే!
Also Read: Gopichand - Prabhas: ప్రభాస్ కి కధ చెప్పిన గోపీచంద్.. 'మైత్రీ'తో సినిమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook