Gopichand - Prabhas: ప్రభాస్ కి కధ చెప్పిన గోపీచంద్.. 'మైత్రీ'తో సినిమా?

Gopichand Malineni With Prabhas: గోపీచంద్ మలినేని వీరసింహ రెడ్డి సినిమాతో హిట్ అందుకోగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే    

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 21, 2023, 11:02 AM IST
Gopichand - Prabhas: ప్రభాస్ కి కధ చెప్పిన గోపీచంద్.. 'మైత్రీ'తో సినిమా?

Gopichand Malineni Narrated a Story to Prabhas: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి అనే సినిమా తెరకెక్కించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చివరిగా రవితేజ హీరోగా క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న బాలకృష్ణతో వీర సింహారెడ్డి అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే బాలకృష్ణ తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభమైంది.

కానీ గోపీచంద్ మలినేని తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ప్రభాస్ అలాగే మరికొందరు హీరోలతో డిస్కషన్స్ అవుతున్నాయని అయితే తన తర్వాతి సినిమా ఎవరితో అనే విషయం మీద ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇంకా వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నామని వీర సింహారెడ్డి ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు తాను బ్రేక్ తీసుకుంటానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.

ఆ తర్వాత తాను చేయబోయే తర్వాతి సినిమా కోసం పనులు మొదలు పెడతానని ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. ఇక ఈరోజు సాయంత్రం విజయసింహుని వీరయాత్ర పేరుతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ జెఆర్సీ కన్వెన్షన్ లో ఒక భారీ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ సహా దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతిహాసన్ వంటి వారు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అయితే ప్రస్తుతానికి ప్రభాస్ చేస్తున్న సినిమాలతో పోలిస్తే గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్ తో ఒక మాస్ సినిమా కనుక బడితే ప్రభాస్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే మాస్ మసాలా సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కానీ ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా మార్కెట్లో అలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక హారర్ కామెడీ సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో గోపీచంద్ మలినేని మాస్ కధ  ప్రభాస్ కు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గోపీచంద్ తో ప్రభాస్ సినిమా అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Dil Raju Sankranthi Race: మరోసారి సంక్రాంతి రేసుకు సిద్దమవుతున్న దిల్ రాజు.. ఈసారి కూడా 'మైత్రీ'తోనే!

Also Read: Jagapathi Babu For Pushpa: పుష్ప కోసం జగపతి బాబు.. అసలు విషయం ఏమిటంటే? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News