Veera Simha Reddy vs Waltair Veerayya Movie Day 1 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్కరోజు వ్యవధితో విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదల అవ్వగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ విడుదలైంది. ఈ సినిమాలు రెండు ఒకే నిర్మాత నుంచి రావడం అలాగే హీరోయిన్ కూడా ఒక్కరే కావడంతో పాటు రెండు సినిమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్స్ కూడా చేస్తూ రావడంతో సినిమాల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి బాలకృష్ణ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రెండు సినిమాల్లో ఈ సినిమా ఎక్కువ పేరు తెచ్చుకుంటుంది అంటూ ప్రతి విషయంలోనూ పోలికలు పెట్టి వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఇప్పటికే విడుదలై మొదటి రోజు పూర్తి చేసుకున్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ రెండు సినిమాలకు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా వీర సింహారెడ్డి మొదటిరోజు వసూళ్లు విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో ఆరు కోట్ల 21 లక్షలు సీడెడ్ ప్రాంతంలో ఆరు కోట్ల 55 లక్షలు వసూలు చేయగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండు కోట్ల 53 లక్షలు వసూలు చేసింది ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 73 లక్షలు వసూలు చేయగా వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు వసూలు చేసింది.


ఇక గుంటూరు జిల్లాలో మూడు కోట్ల 45 లక్షలు కృష్ణా జిల్లాలో కోటి 65 లక్షలు నెల్లూరు జిల్లాలో కోటి 20 లక్షలు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పాతిక కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేయగా 39 కోట్ల 10 లక్షల గ్రాస్ సాధించింది. కర్ణాటక సహా మిగతా భారత దేశంలో కోటీ 75 లక్షలు ఓవర్సీస్ లో మూడు కోట్ల 95 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల ఐదు లక్షల షేర్, 50 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది అదే వాల్తేరు వేరే సినిమా విషయానికి వస్తే  నైజాం ప్రాంతంలో ఈ సినిమా ఆరు కోట్ల 10 లక్షలు,  సీడెడ్ ప్రాంతంలో  నాలుగు కోట్ల 20 లక్షలు వసూలు చేస్తే ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 57 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 68 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల ఆరు లక్షలు వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 75 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా కృష్ణా జిల్లాలో కోటి 49 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి ఐదు లక్షలు వసూలు చేసింది.


తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల 9 0 లక్షల షేర్, 35 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. కర్ణాటక సహా మిగతా భారత దేశంలో కోటి 65 లక్షలు వసూలు చేసి ఓవర్సీస్ లో నాలుగు కోట్ల 75 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల 30 లక్షల షేర్, 49 కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు చేసింది. అలా ఒకరకంగా రెండు సినిమాలు దగ్గర దగ్గరగా వసూళ్లు సాధించినా సరే మెగాస్టార్ చిరంజీవి సినిమా కంటే నందమూరి బాలకృష్ణ సినిమాకి రెండు కోట్లపై వరకు కలెక్షన్లు ఎక్కువ రావడం గమనార్హం.


అయితే ముందు రిలీజ్ అయిన సినిమా కాబట్టి చాలా చోట్ల ఆ సినిమాని తొలగించకుండా వేరే దియేటర్లకు వాల్తేరు వీరయ్యను ఎటాచ్ చేయాల్సి వచ్చిందని ఆ ఎఫెక్ట్ వల్ల వీరయ్య కలెక్షన్స్ తగ్గాయని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. అయితే రెండో రోజు వాల్తేరు వీరయ్య దెబ్బకు బాలకృష్ణ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య సినిమా తీసి బాలకృష్ణ సినిమా వేస్తే మూడవరోజు నందమూరి బాలకృష్ణ సినిమా కూడా కొంతవరకు వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఫాన్స్ దృష్టిలో పడకుండా వారికి టార్గెట్ అవ్వకుండా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎలా తెలివిగా మేనేజ్ చేయగలుగుతుంది అనేది చూడాల్సి ఉంది.


నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. 

Also Read: Waltair Veerayya Collections: మెగాస్టార్ కు మాస్ మహా రాజా తోడైనా.. ఆ సినిమా వసూళ్లను దాట లేకపోయిందే?


Also Read: Veera Simha Reddy Collections: 'వీర సింహా రెడ్డి'కి భారీ దెబ్బ్బేసిన వీరయ్య.. మరీ ఇంత దారుణంగా పడిపోయాయా?