Samantha Latest Stunning Pics సమంత తాజాగా సిటాడెల్ టీంతో కనిపించింది. సమంత బాలీవుడ్‌ అడ్డాలో అడుగు పెట్టినప్పుడు ఒకలా.. టాలీవుడ్లో ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఉన్నంత సేపు ఏదో ఒక డిప్రెషన్‌లో ఉన్నట్టుగా, జాలి కలిగేట్టుగా మొహం పెట్టేస్తోంది. ఇక బాలీవుడ్‌లో అడుగు పెట్టాక మాత్రం మొహం వెలిగిపోయేలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సమంత నటించిన శాకుంతలం సినిమా ఎంతటి డిజాస్టర్‌గా నిలుస్తోందో అందరికీ అర్థం అవుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత ఇప్పుడు ఈ శాకుంతలం నుంచి బయటపడేందుకు రెడీ అయింది. పైగా సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదని, సినిమాకు మనం చేయాలో అది చేయాలని, ఫలితం ఆశించకూడదన్నట్టుగా భగవద్గీత శ్లోకాన్ని షేర్ చేసింది సమంత. దీంతో సమంత ఈ ఫెయిల్యూర్‌ని అంతగా పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పేసింది. అయితే సమంత ఇప్పుడు బాలీవుడ్‌లో సందడి చేస్తోంది.


 



సమంత ఇప్పుడు సిటాడెల్ టీంతో ఉంది. రాజ్ అండ్ డీకే, వరుణ్‌ ధావన్‌లతో కలిసి సమంత సందడి చేస్తోంది. ఇందులో వరుణ్, సమంతల జోడి మీద నెట్టింట్లో వైరల్ అవుతోంది. సమంత అందాల ఆరబోత చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇక సమంత హాట్ పోజులను చూసి, నాభి అందాలను వీక్షించిన సెలెబ్రిటీలు సైతం వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


ఇక సమంత ఫోటోలను చూసిన సెలెబ్రిటీలు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజీలను కీర్తి సురేష్ షేర్ చేసింది. గర్ల్‌ర్‌ర్‌ అంటూ ఇలా రెజినా కామెంట్ పెట్టింది. ప్రెట్టీ వుమెన్ అంటూ రెడ్ హార్ట్ సింబల్స్‌ను నీరజ కోన షేర్ చేసింది. స్టన్నింగ్ అంటూ నవ్వుతున్న ఎమోజీని పెట్టేసింది ఆశ్రిత దగ్గుబాటి. ప్రగ్యా జైస్వాల్ అయితే ఫైర్ ఎమోజీలను పెట్టేసింది.


Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook