Sankranti Releases 2025: 2025 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి పెద్ద పెద్ద హీరోలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటే, ఇంకోవైపు కొన్ని చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోబోతున్నారు. అలా ఇప్పటికే చిరంజీవి విశ్వంభర సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోగా.. ఆ స్థానాన్ని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో భర్తీ చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే బాలకృష్ణ - బాబి కాంబినేషన్లో వస్తున్న డాకు మహారాజా సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఇక ఇప్పుడు వెంకీ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుండడంతో దిల్ రాజుకి పెద్ద దెబ్బ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే రాబోతూ ఉండడం గమనార్హం. 


అసలు విషయంలోకి వెళితే.. చాలా రోజులుగా వెంకటేష్,  అనిల్ రావిపూడి కాంబో సినిమానే సంక్రాంతికి తీసుకొస్తారని చర్చ జోరుగా సాగింది.  దిల్ రాజు కూడా ఈ విషయాన్ని కొన్ని సార్లు సంక్రాంతికి వస్తామని ప్రకటించారు.  అయితే నిన్న మొన్నటి వరకు సంక్రాంతికి వెంకటేష్ - అనిల్ రావిపూడి మూవీని దిల్ రాజు వాయిదా వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఎందుకంటే భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఈ సినిమాను వాయిదా వేయాలనుకున్నారు. 


అయితే దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సిందే అని పట్టు పట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుదీర్ఘ చర్చల తర్వాత దిల్ రాజు వెనక్కి తగ్గారని సమాచారం. ఏది ఏమైనా ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు ఏకకాలంలో విడుదలైతే నిర్మాతకు లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఇకపోతే ఆడియన్స్ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి ఓటేస్తారు. అయితే ఇలా వేరువేరు సినిమాలు విడుదలైనప్పుడు నిర్మాతను దృష్టిలో పెట్టుకొని కూడా సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు దిల్ రాజుకి గట్టి దెబ్బ పడింది అని చెప్పవచ్చు.


 


Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?


 


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.