Vennela Kishore Un known Facts - Vennela Kishore Remuneration News: తెలుగులో ప్రస్తుతానికి టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతూ ఉంటారు కానీ వెన్నెల కిషోర్ మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రమంలో ఆయన గురించి ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. తెలంగాణలోని కామారెడ్డిలో జన్మించిన కిషోర్ కుమార్ హైదరాబాదులో తన డిగ్రీ పూర్తి చేసి అమెరికా పై చదువుల కోసం వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ ఒక తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇదంతా బాగానే నడుస్తున్న సమయంలో దేవా కట్ట వెన్నెల అనే సినిమా చేయడానికి సంకల్పించారు. అలా అమెరికా నేపథ్యంలో ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ను తీసుకువెళ్లే కంటే అక్కడే సెటిల్ అయిన తెలుగువారిని అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకోవాలని ప్లాన్ చేశారు. అలా వెన్నెల కిషోర్ కి అసిస్టెంట్ డైరెక్టర్గా వెన్నెల సినిమాకు ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో ఒక పాత్ర కోసం అప్పట్లో టాప్ కమెడియన్గా ఉన్న శివారెడ్డిని ఎంపిక చేసుకున్నారు సినిమా యూనిట్.


కానీ ఆయనకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన అమెరికా వెళ్ళలేక పోయారు. ఆ పాత్రను కిషోర్ తో ఎందుకు చేయించకూడదు అని ఆలోచించి దేవా కట్ట ఆయనతోనే సినిమా చేయించారు. ఆ సినిమా దెబ్బకు వెన్నెల కిషోర్ కి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అలాగే వెన్నెల అనే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా నిలిచి పోయింది. అలా నటన మొదలు పెట్టిన ఆయన అయినా దూకుడు సినిమాతో ఒక స్టార్ కమెడియన్ గా మారిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నెల కిషోర్ అనేక సినిమాలలో అలరిస్తూ వస్తున్నారు.


ఈ మధ్యకాలంలో కూడా మనం గమనిస్తే ఆయన నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు బ్రహ్మానందం ఎలా అయితే ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉండేవారో ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా అదే విధంగా అన్ని సినిమాల్లో నటిస్తున్నారు. తద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాక మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు వెన్నెల కిషోర్ ఒకరోజు షూటింగ్ కి వచ్చినందుకు గాను మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు.


అయితే ఇది పెద్ద సినిమా నిర్మాతల దగ్గరేనని చిన్న సినిమా నిర్మాతలకు కొంచెం తక్కువకే చేయడానికి కూడా వెన్నెల కిషోర్ ఏ మాత్రం వెనకాడరని టాక్ ఉంది. మరి ఇలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నటుడిగా మారి తెలుగులో స్టార్ కమెడియన్ గా మారడం అనేది చాలా అరుదైన విషయం. అంతేకాదండోయ్ వెన్నెల కిషోర్ వెన్నెల 1 ½, జఫ్ఫా లాంటి సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇక వెన్నెల కిషోర్ మరిన్ని సినిమాలు చేస్తూ మరిన్ని సంవత్సరాలు ఇలాగే తన పుట్టినరోజు జరుపుకోవాలని జీ తెలుగు న్యూస్ టీం కోరుకుంటుంది- హ్యాపీ బర్త్డే కిషోర్.
 Also Read: Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజునే ప్రేక్షకుల ముందుకు ధనుష్ సినిమా!


Also Read: Tollywood Movies Releasing: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి