Samuthirakani Upcoming Movie: విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సముద్రఖని. నటుడిగా రాణిస్తునే.. దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్‌గా తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా మారిన సముద్రఖని.. చివరగా పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్‌ కాంబోలో బ్రో మూవీకి దర్శకత్వం వహించి హిట్ కొట్టారు. డైరెక్టర్‌గా.. యాక్టర్‌గా ఏం చేసినా సముద్రఖని ఉన్నారంటే.. అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ఆడియన్స్ మదిలో మెదిలేలా చేశారు. తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో నటించేందుకు సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రాజకీయ నాయకుడి గురించి తెలుసుకున్న సముద్రఖని.. అవినీతి మచ్చలేని నాయకుడు కావడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడు పేద ప్రజల ఆశ జ్యోతిగా.. సొంత ఇల్లు కూడా సరిగ్గా నిర్మించుకోలేని గొప్ప మానవాతి కావడంతో సముద్రఖని అంగీకరించారట. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన నటించేందుకు ఒప్పుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుండగా.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


ఇదే నిజమైతే సముద్రఖనిలో నట విశ్వరూపం చూడబోతున్నామని సినీ ప్రియులు అంటున్నారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒదిగిపోయి నటించే సముద్రఖని.. ఇక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే రాజకీయ నాయకుడి పాత్రలో జీవించిపోతారని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించి పూర్తి అప్‌డేట్స్‌ త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని ఓ సినిమా చేస్తున్నారు. 


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి