తెలుగు హీరోలు సినిమాల్లో డిష్యూం డిష్యూం చేయడమే కాదు.. కిచెన్ లో డిష్ లు ప్రిపేర్ చేయడంలో కూడా హీరోలే. లాక్ డౌన్ సమయంలో మోహన్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి ( Chiranjeevi ) వంటి తారలు కిచెన్ లో ప్రయోగాలు చేసి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ స్టార్ రెబల్ స్టార్  కృష్ణం రాజు ( Krishnam Raju ) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కిచెన్ లో కింగ్ లా వెళ్లిన కృష్ణం రాజా వారు చేపల పులుసు చేశారు. ఈ పులుసు తయారీనీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది కృష్ణం రాజు కూతురు, ప్రభాస్ ( Prabhas ) సోదరి ప్రసీద ఉప్పలపాటి. 




 ఈ వీడియో షేర్ చేసే సమయంలో వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు సిద్ధం చేశాడు. నాకు తెలిసి చేపల పులుసు వండటంలో ఆయనను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.. వాసన చూసి ఉప్పు ఎంత ఉందో.. రుచి ఎలా ఉందో చెప్పాస్తారు అని ట్వీట్ చేసింది.  కృష్ణం రాజు చేపల పులుసు వండిన వీడియోను చూసి అభిమానులు.. ముఖ్యంగా నాన్ వెజ్ తినే ఫ్యాన్స్ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. మీరు కూడా చూడండి.