VI Anand: మహేష్, పవన్, ఎన్టీఆర్ తో అలాంటి సినిమాలు తీస్తా.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mahesh Babu: ప్రస్తుత తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లకి ప్రత్యేక స్థానం ఉంది. కాగా ఈ ముగ్గురితో తాను తీయబోయే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు క్రియేటివ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్.
Pawan Kalyan: ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఆ తరువాత ఈ దర్శకులు తీసిన ఒక క్షణం సినిమా సైతం కథ పరంగా ఎంతో మందిని మెప్పించింది. ఇక ఈమధ్య ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి మరోసారి తన క్రియేటివిటీని రుజువు చేసుకున్నారు. తన కథ, కథనం ఆలోచన విధానం ఇతర డైరెక్టర్లకి చాలా డిఫరెంట్ గా ఉంటుందని మరోసారి ప్రేక్షకులకు తెలియజేశారు.
సందీప్ కిషన్ హీరోగా చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ బలంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు తెలుగు హీరోల గురించి చెప్పిన కొన్ని మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వి ఐ ఆనంద్.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ..ఏ జోనర్ ఏ హీరోతో చేయాలనే ఆలోచనలో ఉన్నారో ఆడియన్స్ కి తెలియజేసారు.
‘మహేష్ బాబుతో జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇక పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ డ్రామా సినిమా చేయాలి అనేది నా కోరిక’ అని చెప్పుకొచ్చాడు.
‘అలాగే ఎన్టీఆర్‌తో రా అండ్ రస్టిక్ సినిమా, నిఖిల్‌తో హారర్ కామెడీ, నానితో ప్యూర్ లవ్ స్టోరీ, అడివి శేష్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ చేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు. కాగా నిఖిల్ తో ఆల్రెడీ హారర్ బ్యాక్‌డ్రాప్ లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చేశారు. ఈ డైరెక్టర్ ఆ చిత్రం మంచి విజయం కూడా సాధించింది. కాగా నిఖిల్ మరోసారి ఆనంద తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మరి త్వరలో ఈ హిట్ కాంబినేషన్ ఏమైనా సెట్ అవుతుందేమో చూడాలి. ఇక వీటితోపాటు ఈ క్రియేటివ్ డైరెక్టర్ మిగతా స్టార్ హీరోలతో కూడా తను చెప్పిన జోనర్స్ లో చిత్రాల తీస్తారేమో వేచి చూడాలి.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook