విక్టరీ వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథనాయకుడు.  తన నటనలో ఎక్కువ శాతం కామెడీ, సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ చిత్రాలతో ఆయన ఎక్కువ మంది మహిళా అభిమానులకు సంపాదించారు. వెంకీ నటించిన చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.  వెంకటేష్..తను ఎవరితోనూ పోటీ పడరు..తనకు తానే పోటీ అన్నట్లు వ్యవహరిస్తారు. కాగా ఈయన సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత రామానాయుడు గారి కుమారుడు.  డిసెంబర్ 13, 1960లో ప్రకాశం జిల్లా కారంచేడులో వెంకటేష్ జన్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ ప్రస్థానం...


అమెరికా లోని మాంటెర్రీ విశ్వవిద్యాలయము లో ఎం.బి.ఏ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్ వచ్చి సినిమా రంగంలో అడుగుపెట్టారు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించిన విక్టరీ వెంకటేష్.. ఇప్పటి వరకు 7 నంది అవార్డులు గెలుచుకున్నారు.