రివ్యూ: లవ్ గురు (Love Guru)
నటీనటులు: విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, శ్రీజ రవి, తలైవసల్ విజయ్, వీటీవీ గణేష్, ఇలవరసు తదితరులు
సినిమాటోగ్రఫీ: ఫారూక్ బాష
ఎడిటర్: విజయ్ ఆంటోని
సంగీతం: భరత్ ధనశేఖర్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సంద్రా జాన్సన్, నవీన్ కుమార్
రచన, దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్
విడుదల తేది: 11-4-2024


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ ఆంటోని ముందు నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా.. థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. తాజాగా ఈయన తన జానర్‌కు భిన్నమైన కథాంశంతో 'లవ్ గురు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..



కథ విషయానికొస్తే..


అరవింద్ (విజయ్ ఆంటోని) మలేషియాలో కేఫ్ రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతన్ని ఓ గతం వెంటాడుతోంది. మరోవైపు ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 35 యేళ్లు అయినా.. పట్టించుకోడు. ఇక బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోవడానికి సొంతూరు వచ్చేస్తాడు. ఈ క్రమంలో ఓ చావు ఇంట్లో తన రిలేటివ్ అయిన ఓ అమ్మాయి లీల (మృణాళిని రవి) చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లాడుతాడు. ఆమెకు హీరోయిన్ కావాలనేది లక్ష్యం. అందుకోని ఒప్పుకోని తండ్రి హీరోకు ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత కథానాయిక కావాలనుకున్న లీల... తన భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. భార్య మనసు ఎరిగిన అరవింద్ ..ఆమెను తన దారిలోకి తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే 'లవ్ గురు' మూవీ స్టోరీ.


కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
హీరోయిన్ కావాలనుకున్న అమ్మాయిని వాళ్ల తల్లిదండ్రులు ఓ అబ్బాయికి కట్టబెట్టడం.. తాళి కట్టిన తర్వాత భర్తను దూరంగా పెట్టడం వంటివి.. చివరకు ఎన్నో మలుపుల తర్వాత హీరో, హీరోయిన్లు ఏకం కావడమనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. వాటికీ కాస్త భిన్నంగా ఈ సినిమాను ఎంతో హిల్లేరియస్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మధ్యలో సిస్టర్ సెంటిమెంట్‌ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా భార్యను అమితంగా ప్రేమించే భర్త.. మరోవైపు భర్త ప్రేమను అర్ధం చేసుకోని భార్య పాత్రలను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.


మాములుగా అన్ని సినిమాల్లో ఉన్నట్టే కుటుంబం కోసం కష్టపడే హీరో..దీంతో ఏజ్ అవుతున్న తన మ్యారేజ్ చేసుకోవాలన్న సంగతి పట్టించుకోకపోవడం.. ఈ క్రమంలో తన చుట్టాలమ్మాయిని తొలి చూపులో ప్రేమించడం.. అతను ప్రేమించిన... ఆమె నుంచి యాక్స్‌ప్ట్ చేయకపోవడం వంటివి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఇందులో పెళ్లి కాని మధ్యతరగతి యువకులందరు విజయ్ ఆంటోని క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు. కొన్ని సీన్స్ చూస్తుంటే.. షారుఖ్ మూవీ 'రబ్ దే బనాదీ జోడి' సినిమా అక్కడడక్కడా గుర్తుకు తెస్తుంది. హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా సాగుతున్న స్టోరీలో సిస్టర్ సెంటిమెంట్, ప్రీ క్లైమాక్స్ వంటి సీన్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తంగా భార్యను హీరోగా చేయడానికి భర్త తనే నిర్మాతగా హీరో మారి సినిమా చేయడం వంటివి సినిమాటిక్‌గా అనిపిస్తాయి.


నటీనటుల విషయానికొస్తే..
విజయ్ ఆంటోని ఇప్పటి వరకు సీరియస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తూ ఉన్నాడు. ఇందులో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో నటించి మెప్పించాడు. హీరోయిన్‌తో వచ్చే సీన్స్ బాగున్నాయి. హీరోయిన్‌గా మృణాళిని రవి తన నటనతో ఆకట్టుకుంటుంది. విజయ్ మామయ్యగా నటించిన వీటీవీ గణేష్ ఆద్యంతం నవ్వించే ప్రయత్నం చేసాడు. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


ప్లస్ పాయింట్స్


కామెడీతో సాగే  కథనం


క్లైమాక్స్


విజయ్ ఆంటోని నటన


మైనస్ పాయింట్స్


సెకాండాఫ్ ల్యాగ్


పాటలు


రొటీన్ సీన్స్


రేటింగ్.. 2.75/5


Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook