Vijay Antony: విజయ్ ఆంటోని ( Vijay Antony ) బిచ్చగాడు ( Bichagadu ) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. వైవిధ్యభరితమైన చిత్రాలతో నిత్యం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసి సక్సెస్ సాధించడం విజయ్ ఆంటోని ప్రత్యేకత. అయితే అతను నటించిన చిత్రాల్లో బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ ( Bichagadu Sequel ) గురించి చాలా కాలం నుంచి చర్చలు జరుతుగున్నాయి. తాజాగా  దీనికి సంబంధించి బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్‌ను ( Bichagadu 2 first Look ) షేర్ చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో  ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టాడు విజయ్. ( అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green  )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



బిచ్చాగాడు 2 చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కుతోంది. తమిళ చిత్రం పిచైక్కరన్ 2 కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను షేర్ చేశాడు. ఈ చిత్రానికి ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు తమిళ చిత్రాలతో ఒకే సారి 2021లో విడుదల చేయనున్నట్టు తెలిపాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు తొలి చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా, శశి దర్శకత్వం వహించాడు. 


( ఈ వార్త అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేయండి)