Family Star: ఫ్యాన్స్ తో హోలీ జరుపుకున్న విజయ్ దేవరకొండ.. మృణాల్ తో కలిసి డాన్స్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ స్టార్ చిత్రంపై తెలుగు ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల సిద్ధమవుతూ ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేసారు సినిమా యూనిట్.
Mrunal Thakur:
గీతా గోవిందం లాంటి బ్లాక బస్టర్ చిత్రం తర్వాత మరోసారి పరశురామ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యత విడుదలైన విజయ్ దేవరకొండ సినిమాలు అన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి. ఖుషి సినిమా పరవాలేదు అనిపించకుండా ఆ హిట్ క్రెడిట్ మాత్రం సమంతా కి దక్కింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అంటే అది ఫ్యామిలీ స్టార్ తోనే సాధ్యమని అభిప్రాయపడుతున్నారు రౌడీ స్టార్ అభిమానులు.
దిల్ రాజు నిర్మాణంలో వస్తోంది ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఏప్రిల్ 5న విడుదలకు ఏమవుతున్న ఈ సినిమా నుంచి నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నందనందన సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూ సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మధురమే అనే మూడో సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా జరుపుతున్నారు ఈ సినిమా యూనిట్. ఈ క్రమంలో నేడు హోలీ సందర్భంగా ఫ్యామిలీ స్టార్ లోని సాంగ్ ని హోలీ వేడుకలకు జతచేసి ఫ్యాన్స్ మధ్య హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ, మృణాల్. మూడో సాంగ్ ని అభిమానుల మధ్య విడుదల చేయడమే కాకుండా..హైదరాబాద్ లో ఫ్యాన్స్ మధ్య హోలీ రంగులతో ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్ సందడి చేసింది. విజయ్, మృణాల్ తో పాటు ఈ సినిమా దర్శకుడు నిర్మాతను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్యంలో హీరో, హీరోయిన్ ఫ్యాన్స్ పై రంగులు జల్లుతూ హోలీ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటూ డాన్స్ కూడా వేశారు.
మరి విజయ్ దేవరకొండ కి ఈ సినిమా అయినా మంచి విజయం సాధించి పెడుతుందో లేదో చూడాలి.
Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook