Family Star: విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గత కొద్ది కాలంగా వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ ఈ మూవీతో తిరిగి గీతా గోవిందం లాంటి సక్సెస్ అందుకోవాలి అని ఆశిస్తున్నాడు. పరశురాం డైరెక్షన్ లో గీతా గోవిందం తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో చిత్రం పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పాటలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీత గోవిందం మూవీకి స్టోరీ కంటే పాటలే ఎక్కువ సక్సెస్ అందించాయి. సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఇందులోని పాటలు కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి. ఇంకేం ఇంకేం కావాలే పాట తెలుగు సినిమాలో అత్యధికంగా ట్రెండింగ్ చేయబడిన పాటలలో ఒకటి. ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి కూడా ఇదే విధమైన మ్యూజిక్ ని సంగీత ప్రియులు ఆశించారు. కానీ ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.


నంద నందనా పాట కాస్త డీసెంట్ గా ఉన్నప్పటికీ కళ్యాణి వచ్చా వచ్చా, మధురము కదా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరీ ముఖ్యంగా కళ్యాణి వచ్చావచ్చా పాటా విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవుతోంది. టాలీవుడ్ హిట్ సాంగ్స్ మాష్-అప్ గా ఈ పాటను నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో సినిమా మీద బజ్ తగ్గడానికి పాటలు ప్రధాన కారణంగా మారుతాయి అన్న టాక్ వినిపిస్తోంది. సమ్మర్ హాలిడే సీజన్ కావడంతో మూవీ కలెక్షన్స్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. 


ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి వచ్చిన ఇనుమే వంచాలా ఏంటి డైలాగ్.. మూవీపై అంచనాలు భారీగా పెంచింది. అయితే ఇప్పుడు విడుదలవుతున్న పాటల ప్రభావం మూవీ పై ఎలా పడుతుందో అన్న డౌట్ కలుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో భారీ చిత్రాల విడుదల లేనప్పటికీ.. ఈ మూవీ సక్సెస్ సాధిస్తుంది అన్న విషయం చెప్పడం కష్టంగా ఉంది. ప్రస్తుతం సినిమా చిన్నదైనా కంటెంట్ సాలిడ్ గా ఉంటే కలెక్షన్స్ రావడం పెద్ద కష్టం కావడం లేదు.. అదే టాక్ సరిగా లేకపోతే ఎంత భారీ చిత్రమైన బాక్స్ ఆఫీస్ వద్ద చతికిన పడుతోంది. వరుస డిజాస్టర్ తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీస్ సక్సెస్ విజయ్ దేవరకొండ కెరీర్ కి ఎంతో ముఖ్యం. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.


Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ


Also read: Lenovo M11 Tab: 7వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబి ర్యామ్‌తో చాలా తక్కువ ధరకే లెనోవో ట్యాబ్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook