Vijay Devarakonda Invited By Dubai Government for MMA Championship: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో దారుణమైన పరాజయాన్ని అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు టాక్ పరంగా ఇటు బాక్సాఫీస్ పరంగా రెండిట్లో నిరాశ  పరిచింది. అయినా సరే విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంఎంఏ ఛాంపియన్షిప్ కి పోటీపడే బాక్సర్ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు దుబాయిలో నిర్వహించి ఎంఎంఏ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీలకు దుబాయ్ ప్రభుత్వం విజయ్ దేవరకొండను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని అందుకున్న మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ గా విజయ్ దేవరకొండ నిలిచాడు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు,


అయితే ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న జనగణమన సినిమా ఆగిపోయింది అనే టాక్ ఉంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ సినిమా ఆగిపోయిందని దాదాపుగా అందరూ భావిస్తున్నార.  ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా సమంత రూత్ ప్రభు నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు \. అయితే షూటింగ్ పూర్తయి అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 
Also Read: Dil Raju Varusudu : దిల్ రాజుకు షాకిచ్చిన మైత్రీ-యూవీ.. వారికి షాకిచ్చేందుకు సర్వం సిద్ధం!


Also Read: Asian Namratha: భార్య పేరుతొ మహేష్ హోటల్స్.. నవంబర్లో ఒకటి, డిసెంబర్లో ఒకటి ప్రారంభం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook