Vijay Devarkonda with Boypati:టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శీను. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్.. బోయపాటి కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సరైనోడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలబడమే కాకుండా అల్లు అర్జున్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో హీరో ఎవరు అనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2016లో బోయపాటి శీను.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన సరైనోడు మూవీ ఏ రకమైన సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా.. హై రేంజ్ మాస్ ఎలివేషన్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తిరిగి అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాలుగా అల్లు అరవింద్ తో పెండింగ్ ఉన్న తన కమిట్మెంట్ ను కంప్లీట్ చేయడానికి బోయపాటి ఫిక్స్ అయ్యాడు. అయితే ఇందులో హీరో అల్లు అర్జున్ మాత్రం కాదు అని టాక్. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 మూవీ తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ కోసం  మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.


కమిట్ అయిన ప్రొజెక్ట్స్ ని కాదు అని బోయపాటి శ్రీను తో అల్లు అర్జున్ మూవీ చేసే సీన్ అయితే లేదు. మరోపక్క బోయపాటి తన నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో చేయబోతున్నాడు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ కు అఖండ రూపంలో అఖండమైన విజయాన్ని అందించిన బోయపాటి ఆ మూవీ సీక్వెల్ ని చేయబోతున్నాడు అని కొందరు అంటున్నారు. అయితే అకండ2.. అది కుదరని పక్షంలో 14 రీల్స్ నుంచి ఎప్పుడో అడ్వాన్స్ కమిట్ అయిన బాలయ్య, ఆ మూవీని బోయపాటితో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్న ప్రచారాలు జరుగుతున్నాయి.


అయితే సడన్ గా ఈ కాన్సెప్ట్ లో ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంటర్ అయ్యాడు. బోయపాటి సిద్ధం చేసుకున్న స్టోరీ రౌడీ హీరో ఇమేజ్ కి బాగా సెట్ అవుతుందని.. అందుకే బోయపాటి నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ తో తీసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. బన్నీ నుంచి కంప్లీట్ క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బోయపాటితో సినిమా చెయ్యడు. ఇక నెక్స్ట్ వినిపిస్తున్న రెండు పేర్లలో ఒకటి బాలకృష్ణ అయితే మరొకటి విజయ్ దేవరకొండ. బోయపాటి ,బాలయ్య కాంబో అంటే చూడగలం. కానీ విజయ్ దేవరకొండ, బోయపాటి కాంబో మరో స్కందా అవుతుందేమో అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం


Also ReadSamudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook