Dil Raju rejects Vijay Devarkonda:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న సినిమాలలో చిన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో అర్జున్ రెడ్డి తో స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఎంతోమంది అమ్మాయిల ఫేవరెట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్. అయితే విజయ్ దేవరకొండ కి ఈ పాపులారిటీ అనుకొన్నంత ఈజీగా రాలేదు. ఎన్నో ఆటంకాలని దాటుకుంటూ అలానే ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత ప్రస్తుతం విజయ్ ఉన్న పొజిషన్ కి చేరారు.


తన గత ప్రయాణంలో నిర్మాత దిల్ రాజుతో ఎదుర్కొన్న ఒక సంఘటనను బయటపెట్టారు విజయ్ దేవరకొండ.
2015లో నిర్మాత ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా విస్వంత్, పార్వతీశం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘కేరింత’. అయితే ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ ఆడిషన్ ఇచ్చారట. కానీ అప్పుడు దిల్ రాజు విజయ్ ని ఎంపిక చేసుకోలేదు. అప్పటికి విజయ్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. కేరింత సమయానికి శేఖర్ కముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. అయినా కానీ విజయ్ దేవరకొండ కి దిల్ రాజు సినిమాలో అవకాశం రాలేదట. దీంతో విజయ్ బాగా హర్ట్ అయ్యారంట. వీళ్ళందరికీ తానేంటో హీరో అయ్యి చూపిస్తానని విజయ్  అప్పట్లో మనసులో అనుకున్నారట. అలా అనుకోని నేడు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేసే స్థాయికి ఎదిగారు ఈ హీరో. 


మరో విశేషం ఏమిటి అంటే సాధారణంగా నిర్మాత .. దిల్ రాజు తన హీరోలకు ఎప్పుడు ముందుగా అడ్వాన్స్ ఇవ్వరు. సినిమా స్టార్ట్ చేసిన తరువాతే  అడ్వాన్స్ లు ఇస్తారు. అయితే మొదటిసారి ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు విజయ్ దేవరకొండ కి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారట. ఈ విషయాలు అన్నీ స్వయంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఇదే కదా అసలైన విజయం అంటే అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు.


కాగా ఫ్యామిలీ స్టార్ చిత్రం తరువాత దిల్ రాజు, విజయ్ తో మరో సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాటిలో ఒకటి స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అయిపోయిందని అలానే ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతోందని వినికిడి. మరోపక్క విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్..దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది.


Also Read: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..


Also Read: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook