The Family Star OTT News: హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. అంతేకాదు విజయ్ దేవరకొండ స్టార్ డమ్‌కు ఈ సినిమా పెద్ద పరీక్షనే పెట్టింది. ఈ సినిమా తొలిరోజు కనీస ఓపెనింగ్స్ రాబట్టలేక కుదేలైంది. థియేట్రికల్‌గా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'ధి ఫ్యామిలీ స్టార్' మూవీ నిలిచింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ రానుంది. ఈ సందర్భంగా అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. సినిమా స్టోరీ బాగున్నా.. అది ప్రేక్షకులకు డేలీ సీరియల్ చూసిన ఫీలింగ్ రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. ఇక ఈ సినిమాలో  విజయ్ దేవరకొండ, మృణాల్  సేన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మొత్తంగా థియేట్రికల్‌గా ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇక ఈ సినిమాను ఓటీటీ వేదికగా ఎంచక్కా చూడొచ్చు.


ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ భారీ ఎత్తున నిర్మించారు. గీత గోవిందం' సినిమాకు సంగీత బాణీలు అందించిన గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్  'ఖుషీ' మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు. త్వరలో గౌతమ్ తిన్ననూరి సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో తొలిసారి కాప్ పాత్రలో కనిపించబోతున్నారు.


ఇదీ చదవండి: Lok Sabha Polls 2024: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook