Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఈ నెల 19న 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా రేపు (26-4-2024)న దేశ వ్యాప్తంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బంగల్, అస్సామ్, రాజస్థాన్ సహా 13 రాష్ట్రాల్లోని 89 లోక్ సభ స్థానాలకు బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఇందులో కేరళలోని 20 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు.. రాజస్థాన్‌లోని 13 స్థానాలు , అస్సామ్, బిహార్‌లోని 5 స్థానాలు..మధ్య ప్రదేశ్‌లోని 7 స్థానాలు.. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని 8 స్థానాలు.. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని 3 స్థానాలు..
జమ్మూ కశ్మీర్లో జమ్మూ స్థానానికి, త్రిపుర, మణిపూర్‌లోని ఒక్కో స్థానానికి ఎన్నికల జరగనున్నాయి. ఈ విడతతో కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావొస్తోంది.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రాంతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
మరోవైపు.. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శుక్రవారం ఉ 7.00 గంటల నుంచి సా 5.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశ పోలింగ్‌లో రాహుల్ గాంధీ (వాయనాడ్), భూపేష్ భగల్ (రాజ్ నందగావ్) నుంచి బరిలో ఉన్నారు. డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), శోభ కరంద్లాజే (బెంగళూరు నార్త్), తేజస్వి సూర్య (బెంగళూరు సౌత్), హెచ్ డీ కుమారస్వామి (మాండ్యా), అనిల్ ఆంటోని (పతన తిట్ట), రాజీవ్ చంద్రశేఖర్, శశిథరూర్ (తిరువనంతపురం), వైభవ్ గెహ్లాత్ (జలోర్), రాజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్ పూర్), అరుణ్ గోవిల్ (టీవీ రాముడు) (మీరట్), హేమా మాలిని (మధుర) నుంచి ఆయా పార్టీల తరుపున బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 191స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో ఐదు విడతల్లో 352 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook