ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. రోజుకో కొత్త ఛాలెంజ్‌తో వస్తున్నారు ఒకరు పిల్లో ఛాలెంజ్ అంటే, మరొకరు, #BeTheRealman అంటారు. ఇంకొకరు మేకప్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ కొరటాల శివ ఇంటి పని చేశారు. ఇంట్లో అంట్లు తోమడం, ఇల్లు శుభ్రంగా తడవడం లాంటి పనులు చేశారు.  కరోనాను తరిమికొట్టిన మరో రాష్ట్రం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా, రాను రాను  అలవాటయ్యి, ఇప్పుడు సరదా అయింది’ బి ద రియల్ మ్యాన్ అంటూ హీరో విజయ్ దేవరకొండకు ఛాలెంజ్‌ విసిరారు. రియల్ మ్యాన్ ఛాలెంజ్ చేసుందుకు రౌడీ హీరో విజయ్‌ని కొరటాల శివ నామినేట్ చేశారు. అయితే అందరూ ఊహించినట్లుగా విజయ్ దేవరకొండ నుంచి రియల్ మ్యాన్ ఛాలెంజ్ పనికి సంబంధించి వీడియో రాలేదు. కానీ ఆసక్తికర స్పందన మాత్రం దొరికింది. ఆ మహిళ సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట 



‘శివ సార్... మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లే. పని డబుల్ అవుతుందట. మా ఇంట్లో నన్ను రియల్ మెన్ లాగ చూడట్లేదు. పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్ గడువు ముగిసేలోగా నాదైన మార్క్ మాత్రం కచ్చితంగా చూపిస్తాంటూ’ విజయ్ దేవరకొండ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 


విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. విజయ్ చెయ్యి గానీ అతి చెయ్యకు అని కొందరు, యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావ్ అని ఇంకొందరు చురకలు అంటిస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos