కరోనా వైరస్ మానవ శరీరంలో రెండు వారాల నుంచి 28 రోజులపాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరికి ఏ లక్షణాలు కనిపించకున్నా కోవిడ్ పాజిటివ్‌గా తేలుతున్న కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళకు దాదాపు 42రోజుల తర్వాత కరోనా నెగటివ్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకుంది. కరోనా లక్షణాలు కనిపించకున్నా టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో దాదాపు నెలన్నర రోజులుగా చికిత్స తీసుకుంటోంది. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!
కేరళకు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇప్పటివరకూ 19సార్లు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలగా, 20వ టెస్టులో నెగటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. పథనంతిట్ట జిల్లా వదాసెరిక్కరకకు చెందిన మహిళ ఇటీవల ఇటలీ వెళ్లొచ్చిన జంటతో సన్నిహితంగా మెలగడంతో ప్రాణాంతక వైరస్ బారిన పడింది. కరోనా లక్షణాలతో పథనంతిట్టాలోని కోజాన్చెరి జిల్లా ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు టెస్టులు చేసి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు.
ఆమె షుగర్ పేషెంట్ కూడా కావడంతో వైద్యులు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించారు. మూడు రోజుల కిందటి వరకూ ఆమె నిర్వహించిన 19 టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలడం గమనార్హం. అయితే గత వారం రోజులుగా ఆమెకు ఇవర్‌మెక్టిన్ అనే మెడిసిన్‌ను ఇవ్వడంతో కోలుకున్నట్లు కనిపించారు. బుధవారం వచ్చిన 20వ కోవిడ్ టెస్టులో ఆమెకు నెగటివ్‌గా రావడంతో వైద్యులకు ఛాలెంజ్ విసిరిన కేసులో విజయాన్ని సాధించారు. Photos: లేటు వయసులో బికినీ అందాలు
నిబంధనల ప్రకారం రెండోసారి కూడా నెగటివ్ వస్తే ఆమెను కోవిడ్ నుంచి కోలుకున్నట్లుగా పరిగణిస్తారు. అప్పుడే డిశ్ఛార్జ్ చేస్తారు. అప్పటివరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఆ 62ఏళ్ల మహిళ ఉండనున్నారు. కాగా, కేరళలో క్వారంటైన్ గడువును 28 రోజులకు పెంచారని తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..