Vijay Deverakonda: ప్రేమ పెళ్లి చేసుకుంటా.. నాకు తండ్రిని కావాలని ఉంది: విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు
Vijay Deverakonda Reacts About Love Marriage Kids: సొంత ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
Vijay Deverakonda: తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రేమ గురించి మాట్లాడాడు. తనకు ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉందని అదే చేస్తానని ప్రకటించారు. అయితే ప్రేమ పెళ్లి విషయంలో ఈ రౌడీ హీరో ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏమిటి? ఇంతకు ఎవరితో ప్రేమలో ఉన్నాడు అనే విషయాలను ప్రెస్‌మీట్‌లో పంచుకున్నాడు.
తన కెరీర్‌లో 'గీత గోవిందం' వంటి కీలక విజయం ఇచ్చిన పరశు రామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీగా 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాలు తమిళనాడులో నిర్వహించారు. తమిళ మీడియాతో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్ ఇలా వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. 'తప్పకుండా. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఈ ఏడాది కాదు. ప్రేమ వివాహమే చేసుకుంటా. అయితే ఆ అమ్మాయి మా అమ్మనాన్నకు నచ్చితేనే చేసుకుంటా' అని చెప్పాడు.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
ఇక తమిళ సినీ పరిశ్రమపై స్పందిస్తూ.. 'నాకు తమిళ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొంతమంది తమిళ దర్శకులు కథలు చెప్పారు. త్వరలోనే అవి సినిమాలుగా వస్తాయి. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాలో చాలా మంది తమిళ నటీనటులు నటిస్తున్నారు' అని అర్జున్ రెడ్డి తెలిపాడు. 'ఫ్యామిలీ స్టార్' విషయమై మాట్లాడుతూ.. 'యూనివర్సల్ కంటెంట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు. మొదట ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం. తమిళ భాషలో 250 థియేటర్‌లో విడుదల అవుతుంది. రెండు వారాల అనంతరం హిందీ, మలయాళంలో విడుదల చేస్తాం. నాలుగు ఫైట్ సన్నివేశాలు ఉండడంతో యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు' అని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook