Vijay Deverakonda Samantha Movie: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, బ్యూటీ క్వీన్ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఇవాళ (ఏప్రిల్ 21) అధికారికంగా లాంచ్ అయింది. సినిమా లాంచ్‌కి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు. హరీశ్ శంకర్‌తో పాటు దర్శకులు కొరటాల శివ, బాబీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పూర్తిగా డీసెంట్ లుక్‌లో.. రాముడు మంచి బాలుడు టైప్‌లో కనిపిస్తున్నాడు. విజయ్-సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషం అబ్దుల్ హవద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా లాంచ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


కాగా, ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమైన 'ఖుషీ' టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. శివ నిర్వాణతో సినిమా పూర్తయ్యాక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ 'జన గణ మన' సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే విజయ్-పూరి కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా రానున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ సినిమా విడుదల కానుంది. 


Music by @HeshamAWMusic 💝

Shoot begins this month! #VD11Launch pic.twitter.com/rjAtG5Td0B

 

— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2022

Also Read: పట్టు వస్త్రంపై రామాయణం.. 32 వేల సార్లు 'జై శ్రీరామ్' నామం... చీరపై చేనేత కళాకారుడి అద్భుత డిజైన్..  


Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook